కర్నూల్

క్రీడల్లో ఎదిగేందుకు జోనల్ క్రీడలు పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 11:విద్యార్థులు క్రీడా భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు జోనల్ స్థాయి క్రీడలే పునాది అని జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ అధికారి జగన్నాథరెడ్డి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ, ఇందిరాగాంధీ స్మారక మున్సిపల్ పాఠశాలల ఆధ్వర్యంలో జరుగుతున్న కర్నూలు జోన్ క్రీడా పోటీల్లో భాగంగా సోమవారం వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ(అండర్-14), సెపక్‌తక్రా క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షకుల సేవలను పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఈటీల సమన్వయంతో నిర్వాహకులు క్రీడలను విజయవంతంగా నిర్వహించడం మంచి పరిణామన్నారు. కాగా ఈ.తాండ్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టు వాలీబాల్ అండర్-17 పోటీల్లో ఫైనల్స్‌కు చేరింది. సెమీఫైనల్‌లో వన్‌టౌన్ పాఠశాలపై 25-21, 25-17 పాయింట్ల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. అలాగే సెపక్‌తక్రాలో మాంటిస్సోరి(విద్యానగర్) డబుల్ క్రౌన్ అండర్-14 అండర్-17 విభాగాల్లో మాంటిస్సోరి గురుకుల్ కేశవరెడ్డి (వీఆర్ కాలనీ)పై గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. అండర్-14 కబడ్డీ పోటీల్లో గార్గేయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో జడ్పీ హెచ్ స్కూల్ వసంత నగర్ జట్టుపై 32-21 పాయింట్ల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. కార్యక్రమంలో నిర్వాహక కార్యదర్శి ఎం.కమాల్‌బాషా, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు మల్లికార్జునరావు, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
అహోబిలం హుండీ ఆదాయం లెక్కింపు
ఆళ్లగడ్డ, డిసెంబర్ 11: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో సోమవారం లెక్కించిన హుండీ లెక్కింపులో రూ. 21 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కామేశ్వరమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంతో పాటు కారంజనరసింహాలయం, వరాహ నరసింహాలయం, మలోలా నరసింహాలయాలలోని హుండీలను కూడా లెక్కించామన్నారు. ఈ లెక్కింపులో రూ. 21 లక్షలు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధి సంపత్, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.