కర్నూల్

రైతుల అభ్యున్నతే టీడీపీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, డిసెంబర్ 11: రైతులు అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని మార్కెట్‌యార్డు ఆవరణంలో సోమవారం ఆమె మినుముల కొనుగోలు కేంధ్రాన్ని ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌యార్డు చైర్మన్ బీవీ రామిరెడ్డి, మార్క్‌ఫెడ్ ప్రతినిధి నాగరాజుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతుందని అందులో భాగంగానే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. రైతులు పండించిన పంటను దళారుల తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని, అలా కాకుండా రైతు నష్ట పోకుండా వుండేందుకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. గతంలో మినుములు క్వింటానికి రూ. 11 వేలు వున్న ధరను దళారులు రైతుల నుండి రూ. 3వేల నుండి 3,500 వరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారన్నారు. అలా కాకుండా రైతులకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కంది, పసుపు పంటలను కూడా కొనుగోలు చేస్తామన్నారు. గతంలో ఆళ్లగడ్డ ప్రాంత రైతులు తాము పండించిన పంటను నంద్యాల యార్డులో వున్న కొనుగోలు కేంద్రాల్లో అమ్మేవారన్నారు. రైతులకు దూరం కావడంతో ఆళ్లగడ్డలోనే మార్క్‌ఫెడ్, నాఫెడ్ వారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 31 వరకు మేలురకం మినుములను రూ. 5,400తో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మినుము పండించిన రైతులు ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ పుస్తకము, సంబంధిత వ్యవసాయాధికారి లేదా విఆర్వో జారీ చేసిన పంట ధ్రువీకరణ పత్రంతో రావాలన్నారు. 10 నుండి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో సంబంధించిన పైకము జమచేయడుతుందన్నారు. రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వాటి ద్వారా రైతులు సాగునీటిని అందిస్తామన్నారు. ఇప్పటికే పట్టిసీమను పూర్తి చేశామన్నారు. ఆళ్లగడ్డలో రైతుబజార్, కోల్డ్‌స్టోరేజిల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ రైతులకు ఆసరాగా భూమా కుటుంబం ఎల్లవేలలా అందుబాటులో వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ బీవీ రామిరెడ్డి, మార్క్‌ఫెడ్ ప్రతినిధి నాగరాజు, ఏడీఏ వరప్రసాద్, శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ దేవస్ధానం కమిటీ చైర్మన్ అంబటి మహేశ్వరరెడ్డి, కోటకందుకూరు సర్పంచ్ రామ్మోహన్‌రెడ్డి, నాయకులు జాఫర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ్యాక్షన్‌ను అరికట్టాలి
* కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్
కొలిమిగుండ్ల, డిసెంబర్ 11: జిల్లాలో ఫ్యాక్షన్ భూతాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించగలిగామని, రోడ్డు ప్రమాదాలు, మహిళల ఆత్మహత్యలకు అందరి సహకారంతో కృషి చేస్తున్నామని కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన కొలిమిగుండ్ల పోలీసు స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పోలీసు స్టేషన్ ఆవరణలో ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. పార్కులో పిల్లలకు, పెద్దలకు సమయపాలన, ఆటవిడుపు కార్యక్రమాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినడంతోపాటు, వారి కుటుంబాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అనేక రూపాల్లో ప్రయోగాలు చేయడం జరిగిందని తెలిపారు. మేలుకొలుపు చైతన్యవంతమైన నినాదాలు చేయడం ద్వారా ఫ్యాక్షన్ వలన కలిగే కష్టనష్టాలను వివరించడం ద్వారా వారిలో మార్పు వచ్చిందన్నారు. అయితే మానవ జీవనానికి ఇబ్బందికరంగా తయారైన, ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు, మహిళల ఆత్మహత్యల నివారణకు అనేక విధాలుగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టిందని ఈ రెండు సంఘటనకు గల కారణాలు విశే్లషిస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ, ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. విజిలెన్స్ దాడుల్లో డ్రంకెన్ డ్రైవ్, వాహనాల తనిఖీలు, రికార్డుల పరిశీలన ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో చైతన్య సదస్సు నిర్వహిస్తామని, గ్రామాల్లో కుటుంబ సమస్యలు, సొంత సమస్యలు, ఇతర సమస్యలకు పరిష్కారం చూపించేందుకు కృషిచేస్తున్నామన్నారు. వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించి వేగనియంత్రణ పాటించాలని, అధిక లోడుతో ప్రయాణించకూడదని, వాహనం ప్రయాణించే దారి తెన్నులు కూడా సూచిక బోర్డులను అనుసరించి వాహనాలు నడపాలన్నారు. డ్రైవర్‌కు విశ్రాంతి కూడా అవసరం అని, రాత్రివేళల్లో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి వాహనాలు నడపాలన్నారు. పోలీసులకు ఇతర శాఖల అధికారులు, ప్రజలు, సేవా సంస్థలు, యువకులు అందరు సహకరించినప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యం అవుతుందన్నారు. కొలిమిగుండ్లకు నూతన పోలీసు స్టేషన్ మంజూరు చేసి నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఆళ్లగడ్డ డీఎస్పీ చక్రవర్తి, జమ్ములమడుగు డీఎస్పీ కృష్ణ, సీఐ ఉమా మహేశ్వర్‌రెడ్డి, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, కొండాపురం సీఐ చిన్న పెద్దయ్య, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, రేవనూరు ఎస్‌ఐ మధుసూదన్, కొలిమిగుండ్ల ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, ఏఎస్‌ఐ గని, లక్ష్మినారాయణ, బాబా ఫకృద్దీన్, రఫి తదితరులు పాల్గొన్నారు.