కర్నూల్

హోదాపై ఉలుకు పలుకు లేని కాంగ్రెస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, ఏప్రిల్ 25: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజిని ఇవ్వాలని కోరుతూ ఇటు అధికార తెలుగుదేశం పార్టీ, అటు వామపక్షాలు అలుపెరగ కుండా హోదా ఉద్యమ హోరును ముందుకు తీసుకుపోతున్నా... ఇంతవరకు కోడుమూరులో మాత్రం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఉలుకు పలుకు లేదు. జిల్లా అధిష్టానం, నియోజకవర్గ స్థాయిలోని క్యాడర్‌లోని నాయకత్వంలో కూడా ఎలాంటి కదలికలు లేక పోవడం మండలం, గ్రామ స్థాయిలోని క్యాడర్ తటస్థలంలో ఉంది. ఈ హోదా ఉద్యమ పోరులో వామ పక్షాలతో పాటు వైకాపా, ఎమ్మార్పీఎస్, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆయా స్వచ్ఛంద సంస్థలు పాల్గొని బీజేపీ పాలనపై తిరుగుబాటు చేస్తున్నారు. విభజన చట్టాలు అమలు పర్చడంలో ఘోరంగా విఫలమైన బీజేపీ పాలనపై అన్ని వర్గాల ప్రజలు సైతం గొంతెత్తి పోరాటాలకు నాంది పలికారు. ఇదే స్ఫూర్తితో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఇంతవరకు స్పందన లేదని చెప్పాలి. ఇదే పోరును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా హోదా ఉద్యమాలను పూరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా, రెండవ సంతకం రైతుల రుణమాఫీపై చేస్తామని ప్రకటించారు. ఇదే నినాదాలతో ప్రజల ముందుకు వెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కానీ ఇంతవరకు కోడుమూరులో ఒంటరిగా రోడ్డుపైకి వచ్చి ప్రత్యేక హోదా సాధనకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు శ్రీకారం చుట్టలేదని చెప్పాలి. మరో ఏడాదిలో ఎన్నికల సమయం సమీపిస్తున్నా... హోదా ఉద్యమంతో నైనా జనం ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి హోదా ఉద్యమాన్ని జనంలోకి తీసుకురావాల్సి ఉంది. ఇలాంటి అవకాశాలను కూడా కాంగ్రెస్ పార్టీలోని అధినేతలు ఆ దిశగా కదలికలు చేయాలని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు కోరుతోంది. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో మరో సారి అధికారం చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జనంలోకి దూసుకు పోయేలా ఆ పార్టీ క్యాడర్‌ను అంతా ఊరు వాడల్లో చుట్టేస్తున్నారు. ఏది ఏమైన ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అన్నీ రాజకీయ పార్టీల సైతం ఒకే తాటిపై ముందుకు వచ్చి ఉద్యమాలు చేసి హోదాను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఘనంగా వాసవీమాత జయంతి
కోడుమూరు, ఏప్రిల్ 25: స్థానిక శ్రీ కన్యాకాపరమేశ్వరీ దేవి సన్నిధిలో బుధవారం శ్రీ వాసవీమాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయలంలో ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి భక్తి శ్రద్ధతో విశేషంగా పూజలు చేశారు. ఆర్యవైశ్యుల మహిళా మనులు అమ్మవారికి 108 పట్టుచీరలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. సుగంధ ద్రవ్యాల కలశ జలంతో అభిషేకాలు చేసి,ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలు కోలాటాలతో చూపరులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్యుల మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కొత్తూరు విజయలక్ష్మీ, కలికె వసుంధరమ్మ, కొట్ర మమత, శైలజ, దేవి, సుభద్రమ్మ, లక్ష్మయ్య, ఎల్లయ్య, బాలక్రిష్ణయ్య, మల్లికార్జున, మురళి, నారాయణ, ప్రహ్లాద, రాజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.