కర్నూల్

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, మే 21: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం మల్లన్ననను దర్శించుకోవాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. దీంతో గత రెండు రోజులుగా శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీతో కిటకిటలాడింది. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు పూజా వేళల్లో మార్పులు చేసి ముందస్తు చర్యలు చేపట్టారు. వేకువ జామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతి, తదితర ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అనుమతించారు. పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు నేరుగా స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతించడంతో క్యూలైన్లు అన్ని భక్తులతో కిక్కిరిసి పోయాయి. సామూహిక అభిషేక క్రతువులు నిర్వహించేందుకు అధికారులు వీలు కల్పించారు. ఉభయ దేవాలయాల్లో దర్శనం అనంతరం భక్తులు దేవస్థాన అన్నదాన మందిరంలో స్వామి అమ్మవార్ల ప్రసాదం స్వీకరించారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కలిగేలా ఈఓ భరత్ గుప్తా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.