కర్నూల్

‘గుండ్రేవుల’ నిర్మిస్తేనే సీమకు నీరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 21:గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మిస్తేనే సీమకు సాగు, తాగునీరు అందుతుందని, శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులు కొనసాగించాలని రాయలసీమ జలసాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వద్ద సోమవారం ‘మా నీరు మాకే ఇవ్వాలి’ నినాదంతో జలసాధన సమితి అధ్యక్షుడు అచ్చన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపుజాతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొజ్జా మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రాతకోట సమీపంలో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినా ఇంతవరకూ పనులు పూర్తి చేయలేదన్నారు. చాలా ఏళ్లుగా సీమకు చెందినవారే ముఖ్యమంత్రులుగా పనిచేసినా రాయలసీమకు నీటివాటాలో మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ఎత్తిపోతల పథకాలు నిర్మించినా శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం కొనసాగించకపోవడంతో వాటి వల్ల పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదన్నారు. జలసాధన సమితి అధ్యక్షుడు అచ్చన్న మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులకు కేంద్ర బిందువు అయిన నందికొట్కూరు నియోజకవర్గానికి సాగు, తాగునీరు లేకపోవడం శోచనీయమన్నారు. సాగు, తాగునీటి కోసం నియోజకవర్గంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు జీపుయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. మొదటిరోజు మల్యాల, అల్లూరు, వడ్డెమాను, బ్రాహ్మణకొట్కూరు, కోళ్లబావాపురం గ్రామాల్లో జీపుజాతా నిర్వహించారు.