కర్నూల్

నాయకుల అసమర్థత వల్లే తాగునీటి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 26:నందికొట్కూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల చుట్టూ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల అసమర్థత వల్ల ప్రతి ఏడాది వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని జలసాధన సమితి అధ్యక్షుడు అచ్చన్న ఆవేదన వ్యక్తం చేశారు. పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో 6వ రోజైన శనివారం జీపుజాత కొనసాగింది. ఈ సందర్భంగా అచ్చన్న మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయిన మునక గ్రామాలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో వేసవిలో తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. చుట్టూ నీరు ఉన్నా అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగు, సాగు నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.
మహానందిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
మహానంది, మే 26: మహానంది పుణ్యక్షేత్రంలో గత పదిరోజులుగా భక్తుల రద్దీతో క్షేత్రం కళకళలాడుతోంది. పాఠశాలలకు సెలవుదినాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వారాంతపు సెలవులు రావడంతో ఆలయాలు భక్తజన సందోహంతో కిక్కిరిసింది. శనివారం, రాష్ట్రేతరాల నుండి భక్తులు వేలాదిగా క్షేత్రానికి తరలివచ్చారు. ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. క్షేత్రంలో ఎటు చూసినా భక్తుల రద్దీతో కళకళలాడింది.