కర్నూల్

మోదీకి ప్రజలే బుద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మే 26:ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిన మోసకారి నరేంద్రమోదీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి సూచించారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు సమీపంలో ఉన్న తెలుగుతల్లి విగ్రహం వరకూ శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ దేశంలో మోదీ రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి దేశంలో మత కలహాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేశానికి వెనె్నముక లాంటి రైతులకు మద్దతు ధర కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదరిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. దేశంలో ఒకపక్క రైతులు ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే విదేశీ పర్యటనల పేరుతో దర్జాగా యాత్రలు చేస్తూ ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దనోట్లు రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా జీఎస్టీని ప్రవేశపెట్టి ప్రజలపై అధిక భారం మోపుతున్నారని వెల్లడించారు. మోదీ నాలుగేళ్ల రాక్షస పాలనలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై అమానుషాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీకి మూడే రోజులు దగ్గర పడ్డాయని, అందుకు కర్నాటక ఎన్నికలే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారన్నారు.
3న డోన్‌కు సీఎం రాక!
* చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం
డోన్, మే 26:సీఎం చంద్రబాబు జూన్ 3వ తేదీ డోన్‌కు వస్తున్నట్లు అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు జిల్లాలోని 68 చెరువులను హంద్రీనీవా నీటితో నింపే కార్యక్రమానికి డోన్‌లో శ్రీకారం చుట్టునున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీ ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి స్వగ్రామమైన కంబాలపాడులో చెరువులు నింపే కార్యక్రమానికి భూమిపూజ చేపట్టాలని ముందుగా నిర్ణయించారు. అయితే చెరువు పనులకు టెండర్ల ప్రక్రియ జరగకపోవడం వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీంతో జూన్‌లో నిర్వహించే జల హారతి కార్యక్రమంలో భాగంగా డోన్‌లో పర్యటించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోనే అతిపెద్ద చెరువైన డోన్ మండలంలోని వెంకటాపురంలో చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు కేఈ సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జూన్ 3వ తేదీ డోన్ నియోజక వర్గంలోని వెంకటాపురంతో పాటు పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. డోన్, పత్తికొండ నియోజక వర్గాల్లోని వెంకటాపురం లేదా జొన్నగిరి ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట సీఎం పర్యటన ఖరారు చేసే అవకాశం వుందని పార్టీ వర్గాలు తెలిపాయి. డోన్ పర్యటననే అధికారులు ఖరారు చేసే అవకాశం వుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
వెంకటాపురం చెరువు పరిశీలన
డోన్ మండలంలోని వెంకటాపురం చెరువును శనివారం కలెక్టర్ సత్యనారాయణ సందర్శించి చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చెరువు వల్ల కలిగే ప్రయోజనాలను ఆయా గ్రామాల రైతులను అడిగి తెలుసుకున్నారు.