కర్నూల్

కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు రూరల్, మే 26: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి మరోసారి ఎంపీగానే పోటి చేస్తానని, ఇది నూటికి నూరుసార్లు నిజమని ఎంపీ బుట్టారేణుక అన్నారు. శవివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను అంసెబ్లీ స్థానానికి పోటీ చేస్తానని వచ్చేవన్నీ ఉదంతాలని కొట్టి పారేశారు. అంతేకాకుండా కేఈ ప్రభాకర్ కూడా తాను ఎంపీగా పోటీ చేస్తానని ఏనాడూ చెప్పలేదన్నారు. అయితే ఎన్నికల నాటికి పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. కాని తాను మాత్రం ఎంపీగా పోటి చేసేందుకే ఎక్కువ ఇష్ట పడుతున్నట్టు తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు దాదాపు రూ.20 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. ఎంపీ నిధలు అధికంగా వెనుకబడిన నియోజవర్గాలకే అధికంగా కేటాయించానన్నారు. అందులో ప్రతి ఏటా ఆలూరు, పత్తికొండ నియోజవర్గాలకు ఎంపీ నిధులలో రూ.కోటి వరకు కేటాయించానన్నారు. అత్యల్పంగా కర్నూలుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఎందుకంటే కర్నూలు కార్పొరేషన్‌కు వివిధ పథకాల కింద కోట్ల రూపాయల నిధలు వస్తునాయన్నారు. మంత్రాలయం - కర్నూలు రైల్వే లైన్‌కు సర్వే మంజూరైందని, కాని సర్వే పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. చేనేతలకు కార్పొరేట్ శిక్షణ ఇచ్చి వారిలోని నైపుణ్యాని పెంచి వారికి స్వయం ఉపాధి కల్పించాలన్నదే తన ఉద్దేశ్యం అన్నారు. ఆదోనిలో కార్పొరేట్ శిక్షణను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఎమ్మిగనూరు, కోడుమూరులలో కూడా కార్పొరేట్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయన్నారు. వర్షాదార ప్రాంతాల్లో రైతులు ఒకే పంటను పండించి ఆ తరువాత నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి ప్రాంతాల్లో వ్యాపార అభివృద్ధి చేయాలనదే తన లక్ష్యం అన్నారు. కేంద్రం నిధులతో మూడు నేషనల్ హైవే రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా హాలహర్వి మండలంలోని గూళ్ళెం నుండి కర్నాటకకు వంతెనను నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు 250 పెన్షన్లు మంజూరయ్యాని, ఇందులో ఎమ్మిగనూరుకు 120 మంజూరైనట్టు తెలిపారు. కర్నూలులో గతంలో మంజూరై నిలిచిన పోయిన రైల్యే హబ్ ప్రారంభమై పనులు జరుగుతున్నాయన్నారు. ఎంపీ నిధుల్లో 45 శాతం తాగునీటికి ఖర్చు చేసినట్లు ఆమె వివరించారు. కర్నూలులో పాసుపోర్ట్ కార్యాలయం ప్రారంభమైందని, తర్వలోనే పీఎఫ్ కార్యాలయం కూడా ప్రారంభం కానుందన్నారు. ఆదర్శ గ్రామమైన కుంటనహాల్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, కాని నాగలదినె్నలో మాత్రం సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రజల మధ్య ఐక్యత లేదని ఆమె భాదను వ్యక్తం చేశారు. నాగలదినె్నలో పాఠశాలకు, ట్యాంకుకు నిధులు మంజూరు చేయడమే కాకుండా ట్రిబుల్ ఐటీకి పనులు ముమ్మరంగా జరుతున్నాయని తెలిపారు. అనంతరం ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి రూ. 9.78 లక్షల ఎంపీ నిధులతో మంజూరైన ట్యాంకర్‌ను ఎంపీ బుట్టారేణుకమ్మ ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అంతకు మందు మున్సిపల్ అధికారులతో ఎమ్మిగరూరు అభివృద్ధిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జరిగిన అభివృద్ధి గురించి, ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.