కర్నూల్

వద్దుబాబోయ్.. ఈ రైలు ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మే 26: జనరల్ బోగీలో ప్రయాణం చేసే సామాన్య ప్రయాణికుల ప్రయాణం నరకంగా మారింది. రైలు ప్రయాణం వద్దుబాబోయ్ అనే పరిస్థితి ప్రయాణికుల్లో అసహనం కల్గిస్తోంది. ఇక సామాన్యులకు ఉపయోగపడే ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడం వల్ల పేద ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముందు భాగాన జనరల్ రెండు బోగీలు, వెనుక భాగాన రెండు జనరల్ బోగీలు మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే నిత్యం రద్దీతో జనరల్ బోగీల్లో కిక్కిరిసి పోతున్నాయి. కాలు తీసి పెట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితిలో జనరల్ బోగీలో సామన్య, మధ్య తరగతి ప్రయాణికులు ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది. గుంతకల్లు నుంచి ఆదోని డివిజన్ మీదుగా నడిచే గుల్బర్గా- గుంతకల్లు, గుంతకల్లు- గుల్బర్గా ఫ్యాసింజర్లను 29వ తేదీ వరకు రద్దు చేశారు. దీంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలో ప్రయాణం చేసే ప్రయాణికులకు మరింత కష్టం ఏర్పడింది. ఫ్యాసింజర్ రైళ్ల ప్రయాణం చేసే ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించడానికి రావడంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ జనరల్ బోగీల్లో స్థలం చాలక చివరకు రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికులు ఎక్కి ప్రయాణం చేసే పరిస్థితి నెలకుంది. జనరల్ బోగీల్లో ప్రయాణికులు పక్క స్టేషన్లలో దిగుతామని చెప్పి ఆ బోగీల్లో కింద కూర్చూని ప్రయాణం చేస్తున్న సామాన్య మహిళా ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేసే పరిస్థితి నెలకుంది. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా జనరల్ బోగీలు చాలక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి, చెన్నై, గుల్బర్గా, రాయచూర్, యాదగిరి, గదగ్, బళ్ళారి, ముంబాయి, ఢిల్లీ, షర్డీ, కాశీ మొదలగు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు జనరల్ బోగీలు అవస్థలు పడుతూ పోతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ దొరకని ప్రయాణికులు గత్యంతరం లేక జనరల్ బోగీల్లో ఎన్నో అవస్థలు పడుతూ వెళ్లుతున్నారు. రైల్వే అధికారులు ప్రతి ఎక్స్‌ప్రెస్‌కు రెండు బోగీలు వేసి చేతులు దులుపుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రైలు బోగీలను శుభ్రం చేసే పనులను నీటిని నింపే పనులను ప్రైవేటీకరణ చేయడం వల్ల బోగీల్లో మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల బోగీలు దుర్వాసనతో నిండిపోతున్నాయి. ఫ్యాసీంజర్ రైళ్లలో అయితే పరిశుభ్రత పూర్తిగా లోపాభుయిష్టంగా ఉంది. మరుగుదొడ్లును సక్రమంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు శుభ్రం చేయడం లేదు. ఒకవైపు జనరల్ బోగీలు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పరిశుభ్రత లోపించడం వల్ల దుర్వాసన వెదజల్లుతున్నా రైల్వే అధికారులను ప్రయాణికులు తిట్టుకుంటూ ప్రయాణం చేసే పరిస్థితి నెలకుంది. సీటు కోసం రైలు బోగీల చుట్టూ పరగులు తీస్తూ ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేసినప్పుడు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేయకపోవడంపై రైల్వే అధికారులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రైల్వే అధికారులు జనరల్ బోగీలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మారిన పరిస్థితుల అనుగుణంగా కొత్త రైల్వేలైన్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.