కర్నూల్

మంత్రాలయం అభివృద్ధికి రూ. 68కోట్లతో ప్రణాళిక సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూన్ 17: స్వచ్ఛ ఐకాన్ మంత్రాలయంగా తీర్చి దిద్దేందుకు రూ.68 కోట్ల ప్రణాళికను సిద్ధం చేస్తునట్లు జడ్పీ సీఈఓ విశే్వశ్వరనాయుడు తెలిపారు. గత నాల్గురోజులు క్రితం కేంద్ర ప్రభుత్వం ఫేజ్-3 కింద భారత్‌దేశంలోని ప్రముఖ దేవాలయాలో రెండవ స్వచ్ఛ ఐకాన్ క్షేత్రంగా శ్రీరాఘవేంద్రస్వామి కొలువు తీరిన మంత్రాలయంను ఎన్నిక చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంను జిల్లా జడ్పీ సీఈఓ విశే్వశ్వరనాయుడు, జిల్లాస్తాయి అధికారలతో కలసి మేజర్ పంచాయతీ కార్యాలయంతో పాటు వివిద ప్రాంతాలను పరశీలించారు. అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వచ్ఛ ఐకానిక్ మంత్రాలయంలో భాగంగా దేశవిదేశాల నుంచి మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించి, అధునాథన రీతిలో తీర్చిదిద్దేందుకు కేంద్రం ఆమోదించిందన్నారు. భక్తులకు స్నానపుఘట్టాలు, సీసీరోడ్లు, ఉధ్యాన వనాలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలు, గ్రామస్థులకు, భక్తులకు వివిద వౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో రూ.68 కోట్ల ప్రణాళికను సిద్దం చేసి, కలెక్టర్‌కు అందజేయునున్నామని తెలిపారు. కేంద్రం ఆమోదం తెలపగానే అభివృద్ధి పనులను చేపడుతామన్నారు.
వడ్డెర సంక్షేమానికి పాడుపడతాం
* నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్
డోన్, జూన్ 17:ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎంతో వెనుకబడిన వడ్డెర్ల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని నియోజక టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్ స్పష్టం చేశారు. పట్టణ సమీపంలోని పేరంటాలమ్మ గుడి సమీపంలో నిర్మించతలపెట్టిన వడ్డెర కమ్యూనిటీ భవనానికి ఆదివారం కేఈ శంకుస్థాపన చేయడంతో పాటు రూ. లక్ష విరాళం కూడా అందజేశారు. అనంతరం వడ్డెర సంఘం అధ్యక్షుడు వడ్డే నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేఈ ప్రతాప్ మాట్లాడుతూ వడ్డెర్ల సంక్షేమం దృష్టిలో వుంచుకుని కమ్యూనిటీ హాల్‌కు 10 సెంట్ల స్థలం ఇప్పించినట్లు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని, బీసీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలవాలని కేఈ కోరారు. వడ్డెర ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవళ్ల మురళీ మాట్లాడుతూ వడ్డెర కమ్యూనిటీ హాల్‌కు స్థలంతో పాటు రూ. లక్ష విరాళం అందజేసిన కేఈకి ఎంతో రుణపడి వుంటామని, వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు.
యాదవులను గుర్తించిన ఏకైక సీఎం చంద్రబాబు
* టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్
ఆదోని, జూన్ 17: ఎంతో మంది టీటీడీ పదవి కోసం పొటీ పడినప్పటికి యాదవుడైన తనకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఇచ్చి యాదవులను గుర్తించి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. కావున టీడీపీ పార్టీకి యాదవులంతా కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని రాజకీయ రంగాల్లో వారిని జనాభా ప్రాతి పధికన చట్ట సభలలో అవకాశం కల్పించాలని కోరారు. ఆఖిల భారత మహాసభ శంఖరావం ఆదోనిలో ఆదివారం జరిగింది. యాదవులు పెద్ద సంఖ్యలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఒక ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో పుట్టా సుధాకర్‌యాదవ్, రాష్ట్ర గొర్రెల, మేకల పంపెకం దారుల సంఘం చైర్మన్ నాగేశ్వర్‌యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు యాదవులకు ఇవ్వాలని కోరారు. యాదవుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆలూరు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వీరభద్రగౌడ్ పుట్టా సుదాకర్‌యాదవ్‌కు పూలమాల వేసి శాలువ కప్పి సన్మానించారు.