కర్నూల్

ముదిరిన ఈద్గా కమిటీ వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, జూన్ 17 : డోన్ పట్టణంలోని ఈద్గా కమిటీ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా అన్నదమ్ముల్లా కలిసికట్టుగా జీవించే ముస్లింల మద్య వివాదాలు చెలరేగాయి. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగ నాడే ఇరువర్గాలు పరస్పర దాడులకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడంతో ఆదివారం మళ్లీ దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటన డోన్ పట్టణంలో సంచలనం రేపింది. వివరాలు.. పట్టణంలోని ఈద్గా నిర్వహణ గత దశాబ్దన్నర కాలంగా ఒకే కమిటీ ఆధీనంలో వుంది. కమిటీ పరిధిలో వాణిజ్య దుకాణ సముదాయంతో పాటు వక్ఫ్‌బోర్డు భూములు, ఫంక్షన్ హాళ్లు వుండడంతో కమిటీకి ప్రాధాన్యత పెరిగింది. దీంతో గత కొనే్నళ్లుగా వున్న పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుండగా పాత కమిటీనే కొనసాగాలని మరో వర్గం గత కొంత కాలంగా వాగ్వివాదాలకు దిగింది. ఈక్రమంలోనే ఇరువర్గాలు ఒకరికొకరు పత్రికా ప్రకటనల ద్వారా దుమ్మెత్తి పోసుకున్నాయి. అయితే ఇరువర్గాలు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో ఈ సమస్య డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దృష్టికి వెళ్లినా పరిష్కారం లభించలేదు. దీంతో పాత కమిటీనే కొనసాగుతోంది. అయితే రంజాన్ పండుగ రోజు మదరసా వద్ద వివాదం చెలరేగింది. ఒక వర్గానికి చెందిన జాకీర్‌పై రహీంఖాన్, అక్బర్‌బాషా వర్గీయులు దాడిచేశారు. దీంతో జాకీర్ వర్గీయులు కూడా ప్రతిదాడికి పాల్పడ్డారు. ఆదివారం కమిటీ సమావేశం కాగా ఓ వర్గం కట్టెలు, కొడవళ్లతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్వర్‌బాషా ఇంటిపై దాడి చేసి అక్కడే ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అలాగే ఇంటి ఆవరణలోని వస్తువులన్నీ పగులగొట్టి బీభత్సం సృష్టించారు. పాత కమిటీలో సభ్యులైన అన్వర్‌బాషా కుటుంబీకులపై దాడికి పాల్పడడంతో సమీపంలో నివశిస్తున్న కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఓ వర్గాన్ని చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న డోన్ పట్టణ డీఎస్పీ బాబాఫకృద్దీన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఓ వర్గానికి బలమైన శక్తులు అండగా వుండి దాడికి పురిగొల్పుతున్నారని, వారి ఆగడాలను పోలీసులు అరికట్టాలని బాధితులు కోరారు. గత కొద్ది నెలలుగా కమిటీ వివాదం జరుగుతున్నా అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం వల్లే వివాదం ముదిరిపోయిందని వెంటనే సమస్యను పరిష్కరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.