కర్నూల్

‘సుంకేసుల’కు పెరుగుతన్న వరద..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 17:నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది కర్నాటక సమీపంలోని తుంగభద్ర సమీపంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుంగభద్ర జలాశయానికి రోజుకు 62వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే తుంగభద్ర జలాశయంలోకి దాదాపు 16.32 టీఎంసీల నీరు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ఒక్క టీఎంసీ కూడా చేరలేదు. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇక పూర్తిగా ఎండిపోయి డెడ్ స్టోరేజీకి చేరుకున్న సుంకేసుల జలాశయంలోకి 0.16 టీఎంసీల వరద నీరు చేరింది. దీంతో కర్నూలు నగర ప్రజలకు తాగునీటి ముప్పు తప్పింది. ప్రస్తుతం ఉన్న నీటితో సుంకేసుల జలాశయం నుంచి నగర ప్రజలకు మరొక 20 రోజుల పాటు తాగునీరు సరఫరా చేసే అవకాశం వచ్చింది. గత కొనే్నళ్లుగా వేసవిలో సుంకేసుల జలాశయం పూర్తిగా ఎండిపోతుంది. దీంతో నగర పాలక సంస్థ, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో హంద్రీనీవా నుంచి పందికోన రిజర్వాయర్‌కు నీటిని వదిలి అక్కడి నుంచి గాజులదినె్న ప్రాజెక్టు(జీడీపీ)కు నీటిని తరలించి, ఆ తర్వాత ఎల్‌ఎల్‌సీ కాలువ ద్వారా నగర సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంక్(ఎస్‌ఎస్ ట్యాంక్)కు తరలించి నీటిని శుద్ధి చేసి నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు సరఫరా చేస్తారు.
ప్రస్తుతం నగర జనాభా దాదాపు 6 లక్షల దాకా ఉంది. నగర పాలక సంస్థ అధికారులు ఒక్కో మనిషికి రోజుకు 135 లీటర్లు చొప్పున రోజుకు 80 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నారు. అంటే రోజుకు 50 నుంచి 55 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామని నగర పాలక సంస్థ ఈఈ సురేంద్రబాబు తెలిపారు. అలాగే జీడీపీలో ఇంకా 0.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, వాటితో పాటు సుంకేసుల జలాశయంలో 20 రోజులకు సరిపడా వరద నీరు చేరిందన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌లో కూడా నెల రోజులకు సరపడా నీటిని నిల్వ ఉంచామని, జీడీపీ, సుంకేసుల జలాశయం, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లోని నీరు ఆగస్టు దాకా సరిపోతుందన్నారు. కర్నాటకలోని తుంగభద్ర ప్రాంతంతో పాటు ఏపీలో కూడా ఆశాజనకంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. సకాలంలో మంచి వర్షాలను కురిపించి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా వరుణ దేవుడు కరుణించాలని ప్రజలు కోరుకుంటున్నారు.