కర్నూల్

వేగవంతంగా జలాశయం సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిప్పగిరి, మే, 8: మండలంల పరిధిలోని నగరడోణ జలాశయం సర్వే వేగంగా పూర్తి చేసి టెండరుకు ప్రతిపాధిస్తామని ఆదోని ఆర్‌డిఓ ఓబులేసు ఆదివారం అన్నారు. ఎబిసి కాల్వ 28వ కిలోమీటరు వద్ద జలాశయం నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. జలాశయంకు గుర్తించిన స్థలంలో వేగంగా జంగిల్ కటింగ్ పూర్తి చేసి సర్వే వివరాలు ఇవ్వాలని తుంగభద్ర అధికారులను కోరారు. రూ. 32కోట్లతో నగరడోణ జలాశయం పూర్తిచేస్తానని శనివారం నియోజక వర్గంలోని కురవళ్లి పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంతి చంద్రబాబు హామి ఇవ్వడంవల్ల జలాశయం పనులు ఆదివారం పుంజుకున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు నిధులు కేటాయిస్తానని చెప్పడంవల్ల పనుల పట్ల కలెక్టర్ చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా జలవనరుల శాఖ కార్యవర్గ సభ్యులు కుమార్ గౌడ్, జిల్లా జడ్‌పిటిసి సంఘం అధ్యక్షుడు మీనాక్షి నాయుడు, టిడిపి కన్వీనర్ నగరడోణ కిష్టప్ప జలాశయం పరిధి రైతులు సంబంధిత అధికారిని కలిసి తమ కల నిజం చేయాలని కోరారు. తుంగభద్ర అధికారులు హుసేన్ వీరి బృందం, స్థానిక తహశీల్దారు బాల గణేశయ్య పాల్గొన్నారు.