కర్నూల్

రాజ్యసభ ఆశావహుల్లో టిజి, ఫరూక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 13: రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం కర్నూలు జిల్లా నుంచి మాజీ మంత్రులు టిజి వెంకటేష్, ఎన్‌ఎండి ఫరూక్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాలకు చెందిన ఫరూక్‌కు గతంలో ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. మైనారిటీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం కోసం చంద్రబాబును కలిసి ఫరూక్ విన్నవించుకున్నట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకి సేవలందించిన తాను పార్టీ నిర్ణయం మేరకు తనకు ఇష్టం లేకపోయినా నంద్యాల ఎంపిగా పోటీ చేసి ఓటమిపాలైన విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినట్లు తెలుస్తోంది. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న కాలంలో కూడా పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో తన వంతు కృషి చేసి పార్టీలోకి చేరిన, వెళ్లిపోయిన వారితో కలిసి పనిచేసిన సంగతి పేర్కొంటూ మైనారిటీ కోటాలో తనను రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక కర్నూలుకు చెందిన టిజి వెంకటేష్ గతంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి మరో మారు విజయం సాధించి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తాను ఓడినా పార్టీ విజయం సాధించడంతో నగరంలో పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తూ జిల్లాలో కూడా ప్రజల మద్దతు కూడగడుతున్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి తనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించాల్సిందిగా కోరినట్లు సమాచారం. రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూన్ 21వ తేదీతో ముగియనుంది. వారి స్థానంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టిడిపికి మూడు, వైకాపా తరపున ఒకరికి రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశం ఉంది. టిడిపికి దక్కే సభ్యత్వంలో రాయలసీమ నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారని ఒకరిని ఆంధ్రా ప్రాంతం నుంచి ఎంపిక చేసి మరొకరికి బిజెపి సూచించే అభ్యర్థికి అవకాశం కల్పిస్తారని టిడిపి వర్గీయులు పేర్కొంటున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికలకు పోటీ ఏర్పడితే జూన్ 11న పోలింగ్ నిర్వహించి ఆ తరువాత ఓట్లు లెక్కించి ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు.