కర్నూల్

దైవం అందరికీ సమానమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, మే 22: హైందవ సంస్కృతి ప్రకారం దైవం అందరకీ సమానమేనని హిందూ దేవాలయాల ప్రతిష్ఠాపన పీఠం పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామి అన్నారు. ఆదివారం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంకు సంబంధించిన శ్రీ పరిమళ పాఠశాలలో ఈనెల 20 తేదీ నుండి జూన్ 8 వరకు ఆంధ్రప్రదేశ్ సమర సత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచారకులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈసందర్బంగా పీఠాధిపతి మాట్లాడుతూ ప్రేమించేతత్వం అందరిలో ఉండాలని, హిదూ ధర్మాన్ని ప్రపంచమంతట చాటి చెప్పాలని సూచించారు. హిందూ ధర్మ సంస్కృతి చాలాగొప్పదని, హిందువులు మత మార్పిడి చేసుకోరాదని, హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని గుర్తు చేశారు. అనంతరం శ్రీ మఠం చేరుకున్న పీఠాధిపతికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. మంత్రాలయం మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు శ్రీకమలానంద భారతి స్వామీకి ఫల పుష్పాలుతో ఘనంగా సన్మానించారు.