కర్నూల్

జంగంపాడువాసులకు అండగా ఉంటా:ఎమ్మెల్యే ఐజయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 24:మండల పరిధిలోని శాతనకోట మజారా గ్రామం జంగంపాడువాసులకు అండగా వుంటానని ఎమ్యెల్యే ఐజయ్య హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో కేవలం 40 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయన్నారు. తమకు వున్న కొద్దిపాటి పొలంలో విలువైన గ్రానైట్ వుందని కొందరు వ్యక్తులు గ్రామాన్ని ఖాళీ చేయాలని తమపై వత్తిడి తెస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సర్వే, కొలతల పేరుతో ఎవరు గ్రామానికి వచ్చినా తనకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని, ఏ ఒక్కరూ గ్రామాన్ని విడిచి వెళ్లవద్దని భరోసా ఇచ్చారు.