కర్నూల్

వీడిన వైకాపా నేత హత్యకేసు మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, మే 30:మండల పరిధిలోని గుండాల దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్, వైకాపా నేత కౌలుట్లయ్య హత్య కేసు మిస్టరీని డోన్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఆ కేసుకు సంబంధించి సోమవారం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ బాబాఫకృద్దీన్ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని గుండాల గ్రామానికి చెందిన కౌలుట్లయ్యను ఈ నెల 15వ తేదీ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోట్రాయి గ్రామానికి చెందిన నగేష్‌కు కౌలుట్లయ్యకు మధ్య పాతకక్షలు వుండేవన్నారు. రెండు వారాల క్రితం పాత బస్టాండ్‌లోని మద్యం దుకాణంలో నగేష్, అతడి బంధువు బాలమద్ది మద్యం సేవిస్తుండగా అదే సమయంలోనే కౌలుట్లయ్య కూడా అక్కడికి వచ్చారు. దీంతో ముగ్గురు కలిసి మద్యం తాగారు. అయితే పాతకక్షలను దృష్టిలో వుంచుకుని నగేష్ కౌలుట్లయ్యతో గొడవ పడ్డాడు. అయితే కౌలుట్లయ్య సొంత గ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా నగేష్, బాలమద్ది అతడిపై దాడి చేయగా కౌలుట్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే వారు అతడి వద్ద వున్న రూ. 29 వేలు తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై సిఐ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య దర్యాప్తు ముమ్మరం చేసి హత్య కేసును ఛేదించారు. హత్యకు పాతకక్షలే కారణమని తేల్చారు. అలాగే నిందితులు నగేష్, బాలమద్దిలను అరెస్టు చేసి వారి నుంచి రూ. 3,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సిఐ శ్రీనివాసగౌడ్, పట్టణ, రూరల్ ఎస్‌ఐలు సుబ్రహ్మణ్యంరెడ్డి, రామసుబ్బయ్య పాల్గొన్నారు.