కర్నూల్

రాయలచెరువు నీటిని వృథా చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడబూరు, మే 30: రాయల చెరువునీటిని వృథా చేయవద్దని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామ శివారుల్లో ఉన్న రాయల చెరువును కలెక్టర్ పరిశీలించారు. రాయలచెరువు విస్తీర్ణం, చెరువు కింద ఆయకట్టును, చెరువునీటి సామర్థ్యం వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న పెద్ద చెరువుల్లో రాయలచెరువు ఒకటి అని, సుమారు 1400 ఎకరాల విస్తీర్ణంలో రాయలచెరువు ఉందని అధికారులు తెలిపారు. 225 ఎఫ్‌సి, ఎస్‌పి నీటి సామర్థ్యం కలిగి ఉందని, చెరువు కింద 923 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ చెరువులోని నీటిని వృథా చేయవద్దని ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చూడాలని తెలిపారు. చెరువు పూడిక తీత సక్రమంగా నిర్వహించాలన్నారు. బసలదొడ్డి రిజర్వాయర్ నుంచి నీటిని రాయల చెరువుకు పంపింగ్ చేశారు. ఈకార్యక్రమంలో మంత్రాలయం టిడిపి ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి, తహశీల్దార్ నాగరాజు, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.