కర్నూల్

పత్తికొండలో కృష్ణానది ప్రవహిస్తుందా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 30 : కృష్ణా పుష్కరాల పేరుతో టిడిపి నాయకులు జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారని, కృష్ణానది పరివాహక గ్రామాల అభివృద్ధిని పక్కనబెట్టి ఎక్కడో వుండే పత్తికొండ నియోజకవర్గంలో ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం ఏంటని, అక్కడ కృష్ణానది ప్రవహిస్తుందా అని ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి, కొత్తముచ్చుమర్రి, వనములపాడు, ఎల్లాల గ్రామాల్లో సోమవారం బైరెడ్డి ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ముచ్చుమర్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బైరెడ్డి మాట్లాడుతూ తాను రాయలసీమ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినందునే సిఎం చంద్రబాబు, అధికార పార్టీ నాయకులు ముచ్చుమర్రిని అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. దివంగత ఎన్‌టిఆర్ అస్థికలను ముచ్చుమర్రి వద్ద వున్న కృష్ణానదిలో కలిపిన ప్రదేశాన్ని కృష్ణా పుష్కరాల సందర్భంగా విస్మరించడం శోచనీయమన్నారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 2,150కోట్లు మంజూరు చేయగా అందులో సగానికి పైగా నిధులను కోస్తాకు కేటాయించి సీమకు అన్యాయం చేశారన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి చాలా గ్రామాలకు కేంద్రబిందువుగా వున్న ముచ్చుమర్రిలో ఘాట్ ఏర్పాటు చేయకుండా ఈ నిధులతో పత్తికొండ, మద్దికెర, వెల్దుర్తి మండలాల్లో పనులు చేపట్టడం విడ్డూరమన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఈ గడ్డను విస్మరించిన సిఎం చంద్రబాబు పతనం తప్పదన్నారు. సీమ ఉద్యమ సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన పోరాటం ఆగదని, సీమకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సభలో మాజీ జెడ్‌పిటిసి నాగిరెడ్డి, ఎంపిపి దివ్య, సర్పంచ్‌లు శ్రీనివాసులు, దాసు, శేషన్న, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు.