కర్నూల్

ప్రజల సమస్యలు పరిష్కరించని ఉద్యోగులపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 30: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను వారం లోగా పరిష్కరించకపోతే సంబంధిత కార్యాలయ ఉద్యోగిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ విజయమోహన్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటిపై వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇని ఆదేశించారు. వెల్దుర్తి 8వ వార్డులో వీధి దీపాలు లేవని, పందుల సమస్య తీవ్రంగా ఉందని వీటిపై పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హాలహర్వి, ఆలూరు, చింతకుంట మీదుగా కామినేని హాలుకు నడిచే బస్సు సర్వీసును నిలిపి వేశారని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరారు. అత్యవసర అంబులెన్స్‌ను రాత్రి పూట కౌతాళం మండలం హెడ్‌క్వార్టర్స్‌లో కాకుండా ఉరుకుంద గ్రామంలో ఉంచుతున్నారని, అత్యవసర పరిస్థితిలో వాహనం అడిగితే రూ. 1000 డిమాండ్ చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు మొరపెట్టుకున్నారు. చిప్పగిరి పోస్ట్ఫాసులో ఉపాధి కూలీల పాస్‌బుక్ చేయాలంటే పోస్టుమాస్టర్ రూ. 50 డిమాండ్ చేస్తున్నారని, కూలీలకు చిల్లర ఇవ్వాల్సి వస్తే ఇవ్వడం లేదని, ఇదేమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఉపాధి కూలీలు ఫిర్యాదు చేశారు. కళ్లు కనపడవు, చెవులు వినపడవు, పింఛను జాబితాలో పేరు కూడా వుంది, అయినా పింఛను డబ్బులు ఇవ్వడం లేదని తనకు న్యాయం చేయాలని గోనెగండ్ల ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. వాటిపై స్పందించిన కలెక్టర్ ఒకసారి వచ్చిన సమస్య మరోసారి రాకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో జెసి-2 రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.