కర్నూల్

రాజ్యసభ బరిలో టిజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 30 : రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక సభ్యుడిగా అధికార తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి టిజి వెంకటేష్‌ను బరిలోకి దించాలని నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సోమవారం నిర్వహించిన పలు సమీక్షలు, సమావేశాల అనంతరం టిజి వెంకటేష్ పేరును ఖరారు చేశారు. టిడిపి తరపున నాలుగో అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయిస్తే పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో టిజి ఎన్నిక కావడానికి పోలింగ్ పూర్తయ్యే వరకూ ఆగాల్సి ఉంటుంది. నాలుగో అభ్యర్థిపై వెనక్కి తగ్గితే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఆదోని ప్రాంతంలోని పెద్ద తుంబళం గ్రామానికి చెందిన టిజి వెంకటేష్ సుమారు 45 సంవత్సరాల క్రితం కర్నూలు నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అనేక పరిశ్రమలను నిర్వహిస్తూ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆయన తొలిసారిగా టిడి పి తరపున 1999 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2004లో అదే పార్టీ తరపున పోటీ చేసినా ఓటమిపాలవడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి ఆ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఆయన వైఎస్ మరణానంతరం ఏర్పాటైన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టిడిపిలో చేరి 2014లో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీలో కీలకనేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల జిల్లాలోని పలువురు వైకాపా ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం వెనుక టిజి శ్రమ ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీలో ఆయన పనితీరుపై చర్చించిన మీదట జిల్లాలోని అధికార పార్టీ, వైకాపా నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల ఏకగ్రీవ ఆమోదంతో టిజి వెంకటేష్‌ను రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేసినట్లు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పార్టీ తరపున పోటీ చేసే ముగ్గురు ప్రధాన అభ్యర్థుల్లో ఒక సభ్యుడిగా టిజి విజయం ఖాయమని, ఆయన ఎంపిగా ఢిల్లీ వెళ్లనున్నారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.