కర్నూల్

బసులదొడ్డి జలాశయానికి గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత్రాలయం, మే 30: మండలపరిధిలోని రచ్చమర్రి సమీపంలో ఉన్న గురు రాఘవేంద్ర ప్రాజెక్టు బసుల దొడ్డి జలాశయానికి సోమవారం భారీ గండి పడి నీరు వృథా అయింది. విష యం తెలుసుకున్న కలెక్టర్ విజయమోహన్ హుటాహటీన జలయాశం వద్ద కు చేరుకుని గండిని పరిశీలించారు. స్థానిక అధికారులు వెంటనే పొక్లైనతో గండిని పొడ్చివేయించారు. జలాశయంపై పట్ల నిర్లక్షం దోరణి ప్రదర్శించిన ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005-2006 సంవత్సరంలో రచ్చమర్రి గ్రామ సమీపంలో తొమ్మిది గ్రామాల్లోని విస్తీరణంలో ఉన్న 6,750 ఎకరాలకు 65 ఎంసిఎఫ్‌టి నీటి సామర్థ్యం గల బసులదొడ్డి గురు రాఘవేంద్ర జలాశయ ఆయకట్టును ప్రభుత్వం నిర్మించింది. మంత్రాలయం చుట్టుపక్కల 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జలాశయంలో 50 ఎంసిఎఫ్‌టి నీరు చేరింది. నీటి సామర్థ్యానికి తట్టుకోలేక ఆనకట్ట కుంగి సోమవారం దాదాపు నాలుగు చోట్ల జలాశయానికి గండి పడింది. దీంతో చాలా వరకు నీళ్లు వృథా అయ్యాయి. నీటి వృథాను పరిశీలించిన కలెక్టర్ ఆయన ఆదేశాల మేరకు అధికారులు చిన్న తుంబంళం చెరువుకు మల్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంట్రాక్టర్ నాసిరకం పనులతో, అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో జలాశయం గండికి గురైంది. తప్పు చేసిన కాంట్రాక్టర్లను, నిర్లక్షం వహించిన అధికారులపై విచారణ జరిపి వారిపై తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట టిడిపి నియోజక వర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, ఆర్డీఓ ఓబులేసు, ఇరిగేసన్ ఎస్‌ఇ చంద్రశేఖర్‌రావు, ఇఇ నారాయణస్వామి, డిఇ విజయ్‌కుమార్, ఎఇ ఇస్మాయిల్, తహశీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, ఆర్‌ఐ ఆదామ్, జడ్పీటీసీ లక్ష్మయ్య, మాలపల్లి సర్పంచ్ చావిడి వెంకటేష్, విఆర్‌ఓలు తదితర అధికారులు ఉన్నారు.