కర్నూల్

దేశం గర్వించేలా అమరావతి నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, జూన్ 3:ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవంతో దేశం గర్వించే స్థాయిలో నూతన రాజధాని అమరావతిని నిర్మిం చి తీరుతారని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తెలిపారు. పట్టణంలోని జైకిసాన్ పార్కులో శుక్రవారం చేపట్టిన నవనిర్మాణ దీక్షలో రాజశేఖర్ మాట్లాడారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు పుట్టగతులు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజాసంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి ఓర్వలేకనే వైకాపా అధినేత జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ జలదీక్షను తెలంగాణలో చేయకుండా కర్నూలులో చేయడం హాస్యాస్పదమన్నారు. అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణాన్ని చూసి అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు స్వదేశీ, విదేశీ సంస్థలు ముందుకు వస్తాయనే ముందుచూపుతో సిఎం చంద్రబాబు అమరావతిని ప్రపంచదృష్టి ఆకర్షించేలా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా వుందన్నారు. బైరెడ్డిని ఏ రాజకీయ పార్టీ చేర్చుకోకపోవడంతో చేసేదేమీలేక ఒకరే రోజుకో ఊరు తిరుగుతూ సీమ పేరుతో జపం చేస్తున్నారని, దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సత్యం, పశు సంవర్ధకశాఖ జెడి సుదర్శనం, వ్యవసాయశాఖ ఏడి వీరారెడ్డి, మున్సిపల్ డిఇ నాగభూషణంరెడ్డి, తహశీల్దార్ రమణారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బమ్మ, ఎంపిపి వీరంప్రసాదరెడ్డి, ఆత్మ చైర్మన్ నరసింహారెడ్డి, పీరుసాహేబ్‌పేట సింగిల్‌విండో అధ్యక్షుడు కాతా రమేష్‌రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.