కర్నూల్

రూ. 200 కోట్లతో నగరాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 3:కర్నూలు నగరం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, రూ. 200 కోట్లతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఎస్వీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఎమ్మెల్యే ఎస్వీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో కొత్త ఈద్గా అభివృద్ధికి రూ. 35లక్షలు, పాత ఈద్గాలోని మసీదుపై ఒక ఫ్లోర్ నిర్మాణానికి రూ. 35లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హజ్ హౌస్ నిర్మాణం కోసం రూ. 3కోట్లు కేటాయించిందని, ఆ నిధులతో రంజాన్ మాసంలో ముస్లింలకు రంజాన్ తోఫా కింద రూ. 400 విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 50కోట్లు మంజూరు చేసిందని వాటితో ఆనంద్ థియేటర్ నుంచి హంద్రీ నదిపై గౌరిగోపాల్ ఆసుపత్రి వరకూ రూ. 12కోట్లతో కొత్త రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. అలాగే కృష్ణ పుష్కరాల కింద రూ. 15కోట్లు, 14వ ఆర్థిక సంఘం కింద రూ. 10కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 10కోట్లు మంజూరు చేసిందన్నారు. పాత నగరంలోని జమ్మిచెట్టు నుంచి జోహరాపురం బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 15కోట్లు, ఎ, సి క్యాంపుల మీదుగా పోతున్న సుద్దవాగుకు రక్షణ గోడ నిర్మించేందుకు రూ. 15కోట్లు, నగర ప్రజల ఆహ్లాదం కోసం నగర శివారులోని వెంగన్నబావి దగ్గర రిక్రియేషన్ ఏర్పాటుకు రూ. 15కోట్లు, శ్మశానాల అభివృద్ధికి రూ. 2.75కోట్లను కేవలం 2 నెలల్లోనే సాధించామన్నారు. నగరాభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలని ప్రతిపాదనలు పంపినా సిఎం చంద్రబాబు సహకరిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి మరో రూ. 300కోట్ల నిధులను రాబట్టి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే ఎస్వీతో పాటు టిడిపి నాయకులు అబ్దుల్, రమణ, షరీఫ్, ఏసన్న, సూరి, శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.