కర్నూల్

ముంపు బాధితులకు ఉద్యోగాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 3:శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురైన బాధితులకు జీఓ నెం 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు అవుట్‌సోర్సిరింగ్ లష్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ఎస్ కూడలిలోని జలమండలి కార్యాలయంలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ చిట్టిబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మల్లయ్య, మోక్షమయ్య మాట్లాడుతూ శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. 30 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2012 నుండి నేటి వరకూ సుమారు 703 మందిని అవుట్‌సోర్సింగ్ లష్కర్లుగా నియమించారని, కానీ సక్రమంగా జీతాలు అందక వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా నెలనెలా సకాలంలో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన సిఇ చిట్టిబాబు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లష్కర్లు చెన్నకేశవులు, అసోసియేషన్ నాయకులు సర్వత్తమరెడ్డి, శాలు, రుక్మానందరెడ్డి పాల్గొన్నారు.