కర్నూల్

ఏపిపై చిన్నచూపు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 3:నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నారన్న అనుమానం కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆత్మకూరులో ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెఇ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు కెఇకి పూర్ణకుంభంతో స్వాగతం పలిపారు. ఆ తరువాత కెఇ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కెఇ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీసిన తరువాత నవ్యంధ్రప్రదేశ్ చాలా సమస్యలు ఎదుర్కొంటుందని, అయితే కేంద్రం తగిన విధంగా స్పందంచలేదన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇక సిఎం తలపెట్టిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని విమర్శించే అర్హత కాంగ్రెస్‌పార్టీకి లేదన్నారు. అక్రమంగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన వారు సిగ్గు పడాల్సింది పోయి టిడిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై విమర్శలు చేయడం తగదన్నారు. రూసా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 18 ఆదర్శ డిగ్రీ కళాశాలలను ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ఏర్పాటు చేసిందన్నారు. కర్నూలు నగరంలోని 3 డిగ్రీ కాలేజీలను కలిపి క్లస్టర్ యూనివర్శిటీగా చేసి దాదాపు రూ. 55 కోట్లు మంజూరు చేశామన్నారు. 20 ప్రభుత్వ కాలేజీల్లో వైఫై సౌకర్యం కల్పించామన్నారు. కాలేజీల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే టోల్‌ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, స్టేట్ హజ్ కమిటీ అధ్యక్షుడు అహమ్మద్‌ఉసేన్, కలెక్టర్ విజయమోహన్, అధికారులు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉదయదేవి, శ్రీకాంత్, విజయభాస్కర్, నగర పంచాయతీ చైర్మన్ నూర్‌అహమ్మద్, సింగిల్‌విండో అధ్యక్షుడు జెడ్ శ్రీనివాసరెడ్డి, ఎంపిపి సౌజన్య, ఎంపిటిసి రాముడు, శివశంకరశర్మ, లక్ష్మిదేవి, టిడిపి నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, కృష్ణగౌడ్, గోవిందరెడ్డి, గౌస్‌లాజం, తబ్రేష్ పాల్గొన్నారు.