కర్నూల్

మోదీ పాలనలో అభివృద్ధి దిశగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జఆత్మకూరు, జూన్ 3:మోదీ పాలనలో దేశం బాగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాణి పేర్కొన్నారు. పట్టణ శివారులో నిర్మించిన ఆదర్శ డిగ్రీ కళాశాలను శుక్రవారం ఢిల్లీలోని శాస్ర్తీ భవన్ నుంచి మంత్రి స్మృతి ఇరాణి డిజిటల్ లాంచ్ ద్వారా ప్రారంభించారు. ఆత్మకూరుతో పాటు మహబుబ్‌నగర్, కాశ్మీర్, ఛత్తీస్‌ఘడ్, అమృత్‌సర్, సిక్కింలలో నిర్మించిన ఆదర్శ డిగ్రీ కళాశాలలను ఆమె డిజిటల్ లాంచ్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆమె డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తితో డిజిటల్ వీడియో ద్వారా మాట్లాడారు. అలాగే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రూసా పథకం కింద దేశంలో వున్న డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో వసతులు, వౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే రూసా పథకం లక్ష్యమన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి పరచడానికి నిపుణులైన ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 3 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్యనభ్యసిస్తున్నారన్నారు. దేశంలో 115 యూనివర్శిటీలు ఉండగా కొత్తగా 15 యూనివర్శిటీలు ఏర్పాటు చేశామన్నారు. కళాశాలల్లో అన్ని వౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వౌలిక సదుపాయాల కోసం 56 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు రూ. 2 కోట్లు చొప్పున రూసా నిధులు మంజూరు చేశామన్నారు. కాగా రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నయని ఆదుకోవాలని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి అడుగగా ప్రధాని మోదీ ఏపిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని ఇకముందు కూడా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తారని తెలిపారు.