కర్నూల్

జగన్‌పై సుమోటో కేసు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, జూన్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రజాస్వామ్య విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసు పెట్టి వెంటనే అరెస్టుచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ లింగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదని, కేవలం రాజకీయ జ్ఞానం లేకుండా అజ్ఞానిగా ఉన్న జగన్ మతిస్థిమితం కోల్పోయి సిఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. నేర స్వభావం కలిగి ఉన్న జగన్ ఒక అహంకారి అని అన్నారు. గతంలో కూడా స్పీకర్ కోడెలపై, మంత్రి దేవినేని ఉమాపై అనేక ఆరోపణలు చేశారని ఆరోపించారు. గతంలో కూడా ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి కూడా సిఎంపై నోటికి వచ్చినట్లు మాట్లాడారని, నేడు జగన్ అలాగే మాట్లాడుతున్నారని, వినాశకాలు వచ్చిన్నప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడుతారని, జగన్‌లో మానవత లక్షణాలు లేవని, ఇలాంటి మాటలు మాట్లాడడంపై రాష్ట్ర ప్రజలు, మహిళలు, టిడిపి కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రజలు, టిడిపి కార్యకర్తలు పని చెప్పాల్సి వస్తుందని అన్నారు. అసత్య మాటలు మాట్లాడడం మానుకోవాలని, లేని పక్షంలో జగన్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈసమావేశంలో ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల టిడిపి ఇన్‌చార్జిలు మీనాక్షినాయుడు, వీరభద్రగౌడ్, తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల సంఘం సభ్యులు కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.