కర్నూల్

టిడిపి రాజకీయ పార్టీ కాదు..పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 3 : ఎన్‌టిఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా పేరు మార్చారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కర్నూలు నగరంలో శుక్రవారం జిల్లా పరిషత్ నుంచి చేపట్టిన ‘గడప గడపకూ సిపిఐ’ కార్యక్రమంలో రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. టిడిపి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి సిఎం చంద్రబాబు సిఇఓ అయితే ఎండిగా సుజనాచౌదరి, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌గా టిజి.వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ సేల్స్‌మెన్‌గా నారాయణ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(పిఆర్‌ఓ)గా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే పిఆర్‌ఓగా ఉన్న లోకేష్ తప్పుడు సమాచారం ఇస్తూ కంపెనీకి చెడ్డపేరు తెస్తున్నారని వివరించారు. చంద్రబాబు మహానాడు కార్యక్రమంలో అగ్రకులాల్లో కూడా పేద వారు ఉన్నారని వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తానని ప్రకటించారని, అయితే బాబు దృష్టిలో సుజనాచౌదరి, టిజి వెంకటేష్ పేదవారని అందుకే వారికి రాజ్యసభ సీటు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ వారికి అండగా ఉండేందుకు పార్టీని స్థాపించినట్లు ఎన్‌టిఆర్ చెప్పేవారన్నారు. అయితే నేడు టిడిపిలో కోటీశ్వర్లు, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి వారి చేతిలో బందీగా మార్చి ఎన్‌టిఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిందని, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకుండ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారి రాష్ట్భ్రావృద్ధి గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా, దీక్ష చేపట్టి విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల సాధనకు కృషి చేయాలని అప్పుడే ప్రజలు నమ్ముతారని సూచించారు. ఇక బిజెపి ఎన్నికలకు ముందు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తామని గొప్పలు చెప్పి, కేవలం రూ. 50 కోట్లు ఇచ్చి వాటితోనే సరిపుచ్చిందన్నారు. అంతేకాకుండా విశాఖకు రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ అని ఇప్పటి వరకూ వాటిలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యంగా బిజెపి నాయకులు రాష్ట్రాబివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే, వాటికి రాష్ట్ర ప్రభుత్వం లెక్క చూపడం లేదని విమర్శిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి లెక్క జమ చూపి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. టిడిపి తమకు న్యాయం చేస్తుందన్న భ్రమలో బిసిలు ఉన్నారని, కానీ చంద్రబాబు వారిని ఓటు ఉపయోగించుకుని తర్వాత తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. దీంతో బిసిలు రాబోయే రోజుల్లో తిరుగుబాటు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కావున చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేపట్టి రాష్ట్రానికి ఇచ్చిన హామీల సాధనకు కృషి చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉందని ఆ దిశగా పయనించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, నగర కార్యదర్శి రసూల్ పాల్గొన్నారు.