కర్నూల్

అహోబిలం దేవస్థానం ఇఓ ఇల్లు, కార్యాలయంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, జూన్ 3: అహోబిలం దేవస్థానం పరిపాలనాధికారి రంగరాజు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టడంతో కిటికీలు, ప్రధానద్వారం పాక్షికంగా కాలిపోయాయి. వివిరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు దేవస్ధాన ఇఓ కార్యాలయానికి వెళ్లారు. అయితే కార్యాలయంలో ఎఓ రంగరాజు కోసం వెతికారు. చుట్టుపక్కల ప్రదేశాల్లో వెతికినప్పటికీ ఆయన కనిపించకపోవడంతో ఆవేశంతో వున్న దుండగులు, ఇఓ కార్యాలయంలో వున్న కిటికీ అద్దం పగులగొట్టి, కంప్యూటర్, ప్రింటర్, ఫైల్స్ కింద పడవేశారు. అంతటితో ఆగక ఇఓ కార్యాలయం నుంచి మరో సారి కార్యాలయంలోకి వెళ్లిన దుండగులకు కనిపించిన ఎఇఓ శివరామయ్యపై దాడి చేశారు. ఈ దాడిలో శివరామయ్య చొక్కా పూర్తిగా చినిగిపోయింది. రాత్రి విషయం తెలియగానే సిఐ ఓబులేసు, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రామయ్యలు తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.
తప్పిన పెను ప్రమాదం
అహోబిల దేవస్ధాన పరిపాలనా అధికారి ఇంటికి నిప్పు పెట్టిన విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఫలితంగా భారీ ప్రమాదం తప్పింది. ఏ మాత్రం ఆలస్యం జరిగినా పెను ప్రమాదం జరిగి వుండేది.
దుండగులపై కేసు
ఎఓ రంగరాజు ఇంటిపై, ఇఓ కార్యాలయంపై దాడి చేసిన కేసులో దుండగులపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ ఈశ్వరరెడ్డి తెలిపారు. 210 సర్వేలో వున్న ఇండ్లను కూల్చివేస్తారని భావించి దేవస్థాన పరిపాలనాధికారి రంగరాజు ఇంటితో పాటు ఇఓ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకున్న డిఎస్పీ సంఘటనా స్థలంకు చేరి ఇఓ కార్యాలయంలో వున్న సిసి కెమరాల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించామన్నారు. రామకృష్ణుడు, సుదర్శన్, పుల్లయ్య, బాషా, మరో కొంతమందిని గుర్తించామన్నారు. మహిళలు, పురుషులు ఈ దాడిలో పాల్గొన్నారన్నారు. నిందితులను అరెస్టు చేసి భవిష్యత్‌లో ఇటువంటి చర్యలు జరగకుండా అవరసమైతే రౌడీషీట్ తెరుస్తామన్నారు.
కూల్చివేతను ఆపాలనే దాడి
210 సర్వే నెంబరులో వున్న గృహాల కూల్చివేతను అధికారులు ఆపాలనే ఉద్దేశ్యంతోనే ఈ డాది జరిగినట్లు పలువురు పేర్కొంటున్నారు. 210 సర్వే నెంబరులో వున్న కొన్ని గృహాలను అధికారులు ఇప్పటికే తొలగించగా మిగిలిన గృహాలను కూడా తొలగించేందుకు సిద్ధవౌతున్న తరుణంలో ఈ దాడి జరిగింది. మిగిలిన గృహాలను కూల్చకుండా వుండేందుకే కొందరు మహిళలతో కలిసి ఈ దాడి చేసినట్టి పోలీసులు అంటున్నారు.
దాడి హేయమైన చర్య - ఇఓ
దేవస్థానం స్థలంలో అక్రమకట్టడాలను తొలగిస్తారన్న సాకుతో దేవస్థాన అధికారులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఇఓ తిమ్మనాయుడు అన్నారు. పరిపాలనా అధికారి రంగరాజు ఇంటిపై రెండవ దాడి అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లడుతూ దేవస్థాన అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామే తప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. నిబంధనల మేరకే దేవస్థానం స్థలంలో వున్న కట్టడాలను తొలగించామే తప్ప అందులో తమ వ్యక్తిగత స్వార్థమేమిలేదన్నారు.