కర్నూల్

పుష్కరాల పనుల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 7 : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మండలంలో చేపట్టిన రోడ్డు పనులను మంగళవారం క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. అలాగే శ్యాంపిల్స్ సేకరించారు. పుష్కరాల నిధులు రూ. 39 కోట్లతో మండలంలో రోడ్డు పనులు చేపట్టారు. అందులో భాగంగా మండలంలోని కురుకుందు, వడ్లరామాపురం గ్రామాల మధ్య రూ. 1.5 కోట్లతో, ముష్టపల్లె, బపవనంతాపురం మధ్య రూ. 1.4 కోట్లతో, ఆత్మకూరు పట్టణ శివారు నుంచి కొట్టాలచెరుకు వరకూ రూ. 2 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను క్వాలిటీ కంట్రోల్ ఇఇ రెడ్డప్ప పరిశీలించారు. అలాగే ఆయా రోడ్డుల నుంచి శ్యాంపిల్స్ తీసుకున్నామని, వాటిని ల్యాబ్‌కు పంపి నాణ్యతను పరిశీలిస్తామన్నారు. నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇఇ సుబ్బారెడ్డి, డిఇ సుబ్బరాయుడు, ఏఇ రామసుబ్బారెడ్డి, రమణ, సిబ్బంది పాల్గొన్నారు.