కర్నూల్

రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, జూన్ 7: రౌడీయిజం పేరుతో అమాయక ప్రజలను బెదిరి స్తూ సతాయిస్తే సహించేది లేదని ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. మంగళవారం ఆయన చాగలమర్రికి ఆకస్మికంగా వచ్చి గాంధీ సెంటర్ నుంచి మెయిన్ బజారులో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వ్యాపారుల, విద్యార్థులతో ముచ్చటించారు. ప్రజలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఆయనతో తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటిని పరిశీలించాలన్న ఉద్దేశ్యంతో జిల్లా అంతట ఆకస్మికంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రౌడీయిజం చేసి బెదిరిస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం జరి గే ప్రజాదర్బార్‌లో కాని, ఇతర రోజు ల్లో కాని తమ సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఆళ్లగడ్డ డిఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ప్రజా సమస్యలపై కృషి చేస్తున్నట్లు ప్రశంసించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికై బైండోవర్ కేసులు పెడుతున్నామన్నారు. ఎర్రచందనం నివారణకై దాడులు జరుగుతున్నాయన్నారు. కడప, చిత్తూరు జిల్లాలతో కలసి ఆపరేషన్ కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాలో లక్ష మంది తో నేత్రదానం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, ఎఆర్ సిఐ మహ్మద్ బాబా, ఎస్‌ఐ రామయ్య, పిఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.