కర్నూల్

జగన్ అభివృద్ధి నిరోధకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 7:రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నా సిఎం చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటే, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ వాటిని అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారారని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించగా కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, కలెక్టర్ విజయమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం కెఇ మాట్లాడుతూ విభజన జరిగినప్పుడు రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉండేదని, అయినా సిఎం చంద్రబాబు రూ. 24వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ. 10వేల కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేశారని వెల్లడించారు. అలాగే రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి అవినీతికి తావులేకుండా చేశారన్నారు. దేశ చరిత్రలో రాజధాని లేకుండా విభజించిన రాష్ట్రం ఏపినే అని అటువంటి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇందుకు సహకరించడం మాని సంక్షేమ, అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న జగన్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించడం తగదన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి చంద్రన్నబీమా పథకం ప్రారంభమవుతుందని, వాటిని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించి మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నగరంలోని ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో మహా సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఆ కార్యక్రమానికి ప్రజలతో పాటు అధికారులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావుయాదవ్, బిటి.నాయుడు పాల్గొన్నారు.