కర్నూల్

జలాశయాలు నింపుతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 9 : జిల్లాలోని అన్ని జలాశయాలను ఈ ఏడాది నీటితో నింపుతామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. డిప్యూటీ సిఎం కెఇ గురువారం సుంకేసుల జలాశయం నుంచి కెసి కాలువకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ జిల్లాలోని వెలుగోడు, అలగనూరు, అవుకు, గోరుకల్లు జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తామన్నారు. ఈ 4 జలాశయాలను ఒక్కసారి నింపితే 30 టిఎంసిలకు పైగా నీరు నిల్వ చేయవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని స్పష్టమవుతోందని, అదే జరిగితే హంద్రీ-నీవా కాలువ ద్వారా పడమర ప్రాంతంలోని 100 చెరువులకు నీరు సరఫరా చేస్తామన్నారు. సిద్ధాపురం, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడం ద్వారా ఈ ఏడాది అదనంగా మరో 56వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. హంద్రీ- నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 2.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. సుంకేసుల జలాశయంలో 1.2 టిఎంసిల నీరు అందుబాటులో ఉందని ఈ నీటిని కర్నూలు, నంద్యాల పట్టణాలతో పాటు పలు గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి కోసం విడుదల చేస్తున్నామన్నారు. కరవుతో అల్లాడుతున్న ప్రజలకు ముందస్తు వర్షాలు ఆనందాన్నిచ్చాయన్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా వర్షాలు కురుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతలు, పంట కుంటల ద్వారా భూగర్భ జలాలు భారీ స్థాయిలో పెరుగుతాయన్నారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాకు జీవనాడి అయిన కెసి కాలువకు ముందుగా నీరు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది వర్షాబావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలతో జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోగలిగామని వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 7 లక్షల హెక్టార్లలో పంటల సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను పకడ్బందీగా తయారుచేశామన్నారు. సుంకేసుల జలాశయం వద్ద అతిథి గృహం, కాటేజీలు నిర్మించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. గత ఏడాది అందరి సహకారంతో రెండంకెల వృద్ధిని సాధించామని తెలిపారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం కెఇ సంకల్పించిన అభివృద్ధి కార్యక్రమాల్లో అత్యధిక భాగం ఈ ఏడాది పూర్తి చేస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహనరెడ్డి, మణిగాంధీ, జల వనరుల శాఖ సిఇ చిట్టిబాబు, ఎస్‌ఇ చంద్రశేఖరరావు, ఆర్డీఓ రఘుబాబు పాల్గొన్నారు.