కర్నూల్

సమష్టి కృషితో క్రీడల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు అర్బన్, జూన్ 9:క్రీడా సం ఘాలు, క్రీడాభిమానుల సమష్టి కృషి తో క్రీడల అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్‌వి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జాతీయ క్రీడలకు శిక్షణ కేంద్రాల పరిశీలన పర్యటనలో భాగంగా గురువా రం ఆయన జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియం లో జిల్లా ఒలింపిక్ సంఘం, ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివిధ క్రీడా సంఘాల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో క్రీడల శిక్షణకు అందుబాటులో వున్న వసతులు, క్రీడా సంఘాల కార్యక్రమా లు, శిక్షణ శిబిరాల వివరాలు తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ జాతీయ క్రీడలకు రాష్ట్ర వేదిక కానున్న తరుణంలో రాష్ట్రంలో అందుబాటులో వున్న ప్రదేశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించి జాతీయ పోటీలకు రాష్ట్ర జట్లను సన్న ద్ధం చేయాల్సి వుందన్నారు. క్రీడా సం ఘాల్లో సమన్వయం కొరవడకుండా అందరూ సమష్టి కృషితో పని చేస్తే క్రీడాభివృద్ధి జరిగి రాష్ట్రం ప్రపంచ క్రీడాపఠంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం కార్యదర్శి డా వై. కళ్యాణ్‌కుమార్ మాట్లాడుతూ యుజి సి కింద నాక్ గుర్తింపు పొందిన కళాశాలల్లో నిధులు పుష్కలంగా వున్నాయని శాప్, ప్రభుత్వం సహకారం అందిస్తే ఆ నిధులతో క్రీడా భవనాలు, సముదాయాలు నిర్మించి ప్రతిభావంతులైన క్రీడాకారులు తయారు చేసే అవకాశం వుంటుందన్నారు. అలా గే వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. సమావేశంలో శాప్ డిప్యూటీ డైరెక్టర్ వి.నాగరాజు, డిఎస్‌డిఓ సత్యనారాయణ, ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.