కర్నూల్

మఠంలో గురు పుష్యయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూన్ 9: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం గురు పుష్యయోగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురు పుష్యయోగం పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. బృందావన ప్రతిమను, ఉత్సవ మూర్తి ప్రహ్లాద రాయల తోపాటు వెండి పతాకం, వెండి ధ్వజంను బంగారు పల్లకిలో ఉంచి భాజాభజంత్రీల మధ్య మఠం ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి మూల బృందావనానికి బంగారు కవచం, కర్ణాటకలోని బెంగళూరు నుండి తెచ్చిన వివిధ రకాల పూలతో బహు సుందరంగా అలంకరించారు. గురువారం స్వామి వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి మూల బృందావనాన్ని దర్శించుకునేందుకు బారులు తీరారు. అనంతరం భక్తులు శ్రీ మూల రామ దేవతా మూర్తుల పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అంతక ముందు భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని పసుపు, కుంకుమను సమర్పించారు. రాత్రి ప్రహ్లాద రాయలను గజవాహనం, కొయ్య, వెండి, బంగారు రథాలపై అధిష్టించి ప్రత్యేక పూజలు చేసి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ వైభవంగా ఊరేగించారు. ఈకార్యక్రమంలో మఠం మేనేజర్ శ్రీనివసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.