కర్నూల్

పకడ్బందీగా చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 9:స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ఇంటింటి వివరాలు సేకరించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో గురువారం స్మార్ట్ పల్స్ సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకూ మొదటి విడత, జూలై 6 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న స్మార్ట్ సర్వే ఇంటింటి వివరాల సేకరణ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకూ నిర్వహించాలని మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో భోజన విరామం ఉంటుందన్నారు. స్మార్ట్ పల్స్ సర్వే వివరాల సేకరణ ఎంతో ప్రాధాన్యమైందని ఈ అంశంపై అధికారులు నిర్లక్ష్యం, జాప్యం చేయరాదన్నారు. వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలని బయోమెట్రిక్ వివరాలను కూడా ఇందులో నమోదు చేయాలన్నారు. మండల తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు సమన్వయంతో వివరాల సేకరణకు చర్యలు తీసుకోవాలని, సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు పూర్తి బాధ్యత వహించాలన్నా రు. తొలుత ఎన్యుమరేషన్ ప్రాంతాల ఎంపిక, ఎన్యుమరేటర్ల ఎంపికలో నైపుణ్యం గల వ్యక్తులను నియమించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సమయపాలన పాటించి సకాలంలో వివరాలను సేకరించాలన్నా రు. ఇందులో రెవెన్యూ, పంచాయతీ, డిఆర్‌డిఎ, మున్సిపాలిటీ శాఖలు పని చేస్తాయన్నారు. ఒక ఎన్యుమరేటర్ బ్లాక్‌లో 430 నుంచి 460 ఇంటింటి వివరాలు ఉంటాయని, రోజుకు 14 ఇళ్ల వివరాలు సేకరించాలని తెలిపారు. గతంలో చేసిన సర్వేలలో సేకరించిన వివరాల కంటే ఈ సర్వేలో అధిక వివరాలు ఉండేవిధంగా ప్రభుత్వం నిర్ణీత ప్రొఫార్మాలను నిర్ధేశించిందన్నారు. ప్రతి బృందంలో ఒక ఎన్యుమరేటర్, ఒక సహాయకుడు వుంటారని, అలాగే 10 బృందాలకు ఒక సూపర్‌వైజర్‌ను నియమిస్తామన్నారు. ఆయా ప్రాంతాలకు స్మార్ట్ పల్స్ సర్వేకు వెళ్లే ముందు ప్రచారం చేసి అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి ఖచ్చితమైన వివరాలు సేకరించాలన్నారు. ఈ నెల 14వ తేదీన బైలూటి గ్రామంలో చెంచు సదస్సులు నిర్వహించనున్నామని అందులో చెంచులకు రేషన్‌కార్డుల పంపిణీ, ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 14 మండలాల్లో చెంచులు వున్నారని సదస్సులకు కనీసం ఇంటికి ఒకరైన హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఒక్క ఇంటిని కూడా వదలకుండా స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించాలన్నారు. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజింగ్ అధికారి వుంటారన్నారు. హైదరాబాద్ నుంచి ఒక మాస్టర్ ట్రైనర్ వస్తారని ఏవైనా సమస్యలు వుంటే సరి చేసేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. రంజాన్‌తోఫా కోసం 33 మండలాల నుంచి ముస్లిం, దూదేకుల కులాలకు చెందిన వివరాలు రాలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ గంగాధరగౌడ్, డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డిపిఓ స్వరూపారాణి, ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.