కర్నూల్

తదుపరి లక్ష్యం.. పోతిరెడ్డిపాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 13 : ప్రభుత్వం నుంచి ఎదురైన అనేక ఇబ్బందులను ఎదుర్కొని సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సిద్ధేశ్వరం సాధన సమితి తమ తదుపరి లక్ష్యంగా పోతిరెడ్డిపాడును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధేశ్వరం సాధన కోసం ఉద్యమిస్తున్న నేతలు ఈ సారి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్ల వరకూ శ్రీశైలం జలాలు చేరిన వెంటనే వాటిని ఎత్తివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఖరితో పోలీసుల నుంచి ఎదురైన అనేక ఇబ్బందులను కాదని సిద్ధేశ్వరం అలుగు కోసం సప్తనదీ సంగమేశ్వరం వద్ద నిర్ణయించిన శంకుస్థాపన స్థలి వద్దకు సుమారు 5 వేల మంది చేరుకోవడం సమితి నేతల్లో నూతనోత్సాహం నింపింది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడంతో వారు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంపై ఎంత ఆసక్తి కనపరుస్తున్నారో ప్రభుత్వానికి అర్ధమై ఉంటుందని సమితి నేతలు పేర్కొంటున్నారు. సిద్ధేశ్వరం అలుగు కోసం ఉద్యమించిన తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి నివేదికలు తెప్పించుకున్నా ఇంత వరకూ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక శ్రీశైలం జలాశయం నుంచి కరవు సీమకు 80 టిఎంసిల నీరు ఇచ్చి ఆ లోటును తీర్చేందుకు కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను అందిస్తామని ఇటీవల విజయవాడలో సిఎం చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పట్టిసీమ ఫలాలు రాయలసీమకు చేరాలంటే శ్రీశైలం జలాశయంలో నీటి చేరిక ప్రారంభమై నీటి మట్టం 836 అడుగులకు చేరుకున్న వెంటనే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తడం, హంద్రీ-నీవా పథకం విద్యుత్ మోటార్ల సహాయంతో నీటిని తరలించడానికి తక్షణం ఆదేశాలు జారీ చేయాలని సిఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. జలాశయం నిండే వరకూ పోతిరెడ్డిపాడు గేట్లు తెరవకపోతే తమ వాటాకే నష్టం జరుగుతుందని వారంటున్నారు. పోతిరెడ్డిపాడు గేట్ల ఎత్తివేత విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెల్లడించాలని అదే సమయంలో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను బహిరంగపరచాలని వారు కోరుతున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 830 అడుగులకు చేరే వరకూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించని పక్షంలో 835 అడుగులకు చేరుకున్న వెంటనే పోతిరెడ్డిపాడు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో 25వేల మందికి తక్కువ కాకుండా హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలని వారు భావిస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 835 అడుగులకు చేరుకోవాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందని ఆ రోజుకు కృష్ణా పుష్కర ఘడియలు సమీపిస్తాయని చర్చించినట్లు తెలుస్తోంది. పుష్కరాల పేరుతో శ్రీశైలం గేట్లను ఎత్తేందుకు ప్రభుత్వం వెనుకాడదని అదే సమయంలో పోతిరెడ్డిపాడు గేట్లను ఎత్తేందుకు కార్యక్రమం సిద్ధం చేసి ప్రకటిస్తే బాగుంటుందని సిద్ధేశ్వరం సాధన సమితి, రాయలసీమ రైతు సంఘంతో పాటు పలు సంఘాలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరో మారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.