కర్నూల్

30లోగా కెడిసిసి ఎటిఎంలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 24:జిల్లాలో సహాకార కేంద్ర బ్యాంక్ ఖాతాదారులకు మరింత చేరువైయ్యేందుకు ఈ నెలాఖరుకు ఎటిఎంలను అందుబాటులోకి తేనుంది. దేశంలో మొదటి సారిగా సహకార బ్యాంక్‌ల్లో ఎటిఎంలను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో మొదటి విడత కింద కర్నూలు, కృష్ణ, శ్రీకాకుళం జిల్లాలోని సహాకార బ్యాంక్‌ల్లో ఎటిఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. మిగతా బ్యాంక్‌లకు తీసి పోకుండ జిల్లా కేంద్ర సహాకార బ్యాంక్‌ల్లో ఎటిఎంలను ఏర్పాటు చేసి ఖాతాదారులకు మరింత చేరువై వ్యాపార లావాదేవీలను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కర్నూలు నగరంలో 3 ఏటిఎంలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 బ్యాంక్ శాఖల్లో ఎటిఎంలను ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో సహకార బ్యాంక్ దాదాపు 40మంది ఖాతాదారులున్నారు. వారికి ఇప్పటికే ఆధునిక సేవలను అందించేందుకు కంప్యూటరైజ్డ్ చేసి, సంబందించిన కార్యకలాపాలన్నింటిని కంప్యూటరైజ్డ్ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో దాదాపు 25 ఎటిఎం కేంద్రాలను ఏర్పాటు చేసి ఖతాదారులకు మరింత చేరువైయ్యేందుకు కృషి చేస్తున్నట్లు కెడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎం.మల్లికార్జునరెడ్డి శుక్రవారం ఆంద్రభూమికి తెలిపారు. కొద్ది రోజుల పాటు ఎటిఎంలను ట్రయల్ చేసి, ఈ నెలఖరు నాటికి ఎటిఎంలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. మిగతా బ్యాంక్‌ల్లో ఖాతాలున్న ఖాతాదారులు కూడ ఎటిఎంను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.