కర్నూల్

రాయలసీమకు కేటాయించిన నీటిని ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత వాగ్ధానాలతో, కల్లబొల్లి మాటలతో రాయలసీమ వాసులకు ద్రో హం చేయడం తగదని, సీమ ప్రాంతానికి కేటాయించిన నీటిని సీమ వాసులకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో రాయలసీమ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని తమ కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాం తానికి ఇచ్చిన హామీ మేరకు గాలేరు నగరి, హంద్రీనీవా సుజల శ్రవంతి, గుండ్రేవులతోపాటు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం పూర్తి చేసి సీమ ప్రాంతానికి కేటాయించిన నీటిని వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణాజలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లులో కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు ఆధ్వర్యంలో ఒక వైపు తెలంగాణ రాష్ట్రం, మరో వైపు రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతం ఆధారపడి ఉందన్నారు. టిడిపి నాయకులు సీమ వాసులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ కృష్ణా జిల్లా రాజకీయ నాయకులకు లొంగిపోయి, భారీ ప్రాజెక్టులు నిర్మిం చి కృష్ణా జిల్లాలో సాగుకోసం పడుతున్న తాపత్రయం సీమ వాసులపై ఎందుకు చూపడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, ఇప్పటికే పులి చింత ల పూర్తయిందని, పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను ఆఘమేఘాల మీద కృష్ణా జిల్లాకు తరలించేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నుండి 790 అడుగుల మట్టం వరకు నీటిని గత ఏడాది తరలించుకుపోవడంతో సీమ ప్రాంతం తాగునీటికి కటకటలాడిందన్నారు. సీమ వాసులకు జరుగుతున్న అన్యాయంపై అటు ప్రతిపక్షం కాని, ఇటు ఏ రాజకీయ పార్టీ కూడా బాసటగా నిలువక పోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర సిఎం శ్రీశైలం ప్రాజెక్టులో 100 శతకోటి ఘనపుటడుగుల నీరు నిల్వ చేస్తామని పదే పదే ప్రకటిస్తున్నారని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న ప్రకటనలు కూడా శుష్క వాగ్ధానాలుగా మిగిలిపోతున్నాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వరకు నీటిని స్థిరీకరించి రాయలసీమను ఆదుకోవాలని కోరారు. వచ్చే ఆగస్టు 15 నాటికి గుండ్రేవుల ప్రాజెక్టు, సిద్దేశ్వరం అలుగు నిర్మాణంపై నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకు మల్లించిన గోదావరి జలాల్లో 45 టిఎం సిలు ఆదా చేసిన జలాలను సీమకు కేటాయించాలన్నారు. ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై మాట్లాడుతున్నారే తప్ప సీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీటి అవసరాలపై నోరెత్తలేదన్నారు. ఇప్పటికైనా సీమకు చెందిన సిఎం సీమ ప్రాంతానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో సీమ వాసుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈసమావేశంలో కుందూనది పరిరక్షణ సమితి నాయకులు కామిని వేణుగోపాల్‌రెడ్డి, వైఎన్ రెడ్డి, తూము శివారెడ్డి, భరధ్వాజ శర్మ పాల్గొన్నారు.