కర్నూల్

ఆటో, లారీ ఢీ... ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, జూలై 7: ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని లింగందినె్న రహదారిలో ఆటో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. పట్టణ ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఉయ్యాలవాడ నుండి ప్రయాణికులతో వస్తున్న ఆటో, లోడుతో వెళ్తున్న లారీ రెండు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న అంబారపు చెన్నమ్మ (55), లొడుగు లక్ష్మమ్మ(60) అక్కడిక్కకడే మృతి చెందగా రోజమ్మ, సుబ్బరాయుడు, రెడ్డెపరెడ్డిలు గాయపడ్డారు. వెంటనే గాయపడ్డవారిని 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల వైద్యశాలకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందినారన్న విషయం తెలియగానే డిఎస్పీ ఈశ్వరరెడ్డి, సిఐ ఓబులేసులు సంఘటనా స్ధలానికి చేరుకొని ప్రమాద విషయాన్ని ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లడుతూ ఆటో లారీ ఢీ కొన్న సంఘటనలో ఇరు వాహనాల వారు వేగంగా రావడంతో దానికి తోడు ఇక్కడ వేగనిరోదకాలు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్లు లైసెన్సులు కలిగి వుండాలన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను పరిమితికి మించి వేసుకోకూడదన్నారు.