కర్నూల్

సమయం లేదు.. వేగం పెంచండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 15:కృష్ణా పుష్కర ఘడియలు తరుముకు వస్తున్నాయని, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయమోహన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సంగమేశ్వరం, శ్రీశైలంలో జరుగుతున్న పుష్కర పనులపై కలెక్టర్ శుక్రవారం శ్రీశైలంలో ఎస్పీ ఆకే రవికృష్ణతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18వ తేదీ సిఎం చంద్రబాబు శ్రీశైలంలో పుష్కర పనుల తీరుపై సమీక్షించడమే కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల నాణ్యతను కూడా పరిశీలిస్తారని తెలిపారు. కృష్ణా పుష్కర ఏర్పాట్లపై తాను నిత్యం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నాణ్యతను పరిశీలిస్తూ, పనులు జరుగుతున్న తీరుపై ఆదేశాలు ఇస్తున్నా కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఆగ్రహం తెప్పిస్తోందన్నారు. తన సహనానికి పరీక్ష పెడితే సహించబోనని ఏ చర్య తీసుకోవడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు నాణ్యతగా, గడువులోగా పూర్తి చేయించే బాధ్యత ఆయా శాఖల ఉన్నతాధికారులదే అన్నారు. పుష్కరాలను విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన 14 కమిటీలు పద్ధతి ప్రకారం, నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే సమస్యలు ఉత్పన్నం కావన్నారు. పుష్కరాలకు కేవలం 3 వారాల సమయమే ఉన్నందున అధికారులు ప్రజల కోసం కష్టపడి పనులు చేయాలన్నారు. కృష్ణా పుష్కరాల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు ఆగస్టు 8వ తేదీ బాధ్యతలు స్వీకరిస్తారని ఆ రోజే పుష్కరాలు ప్రారంభమైనట్లుగా భావించాలన్నారు. ఆగస్టు 12వ తేదీ నుంచి భక్తుల రాక ప్రారంభమవుతుందని ఆ రోజుకు సమస్యలు లేకుండా విధుల్లో చేరిన అధికారులు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పుష్కరాల నాటికి కృష్ణా నదికి భారీ నీరు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సంగమేశ్వరం వద్ద జలాశయానికి నీరు చేరితే రహదారి ఇబ్బందులు ఉంటాయని భావించి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు సర్వీసులు నిర్వహించాలని, ప్రైవేట్ వాహనాలు ప్రధానంగా ఆటోలపై పోలీసులు గట్టి నిఘా వేసి ప్రమాదాలు లేకుండా చూడాలని ఎస్పీ రవికృష్ణను కోరారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు, ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లతో కూడిన పుస్తకాలను ముద్రిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అన్ని చోట్ల రహదారులపై సూచికలు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము ప్రత్యేక వ్యూహ రచన చేశామన్నారు. దేశంలో నెలకొన్న శాంతి, భద్రతల పరిణామాల దృష్ట్యా గట్టి నిఘా ఉంటుందని, ప్రతి వాహనం తనిఖీ చేస్తామని భక్తులు సహకరించాలని కోరారు. రక్షణ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు తోడ్పాటు అందిస్తే శాంతియుతంగా పుష్కరాలను నిర్వహించవచ్చని తెలిపారు. సమావేశంలో శ్రీశైలం ఏఇఓ హరినాథరెడ్డి, డిఎఫ్‌ఓ సెల్వం, ఆర్డీఓ రఘుబాబు, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ పాల్గొన్నారు.