కర్నూల్

నష్టపరిహారం అందేంత వరకూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓర్వకల్లు, జూలై 17:మండల పరిధిలోని శకునాల గ్రామం రైతులకు నష్టపరిహారం అందే వరకూ సోలార్ పవర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న పవర్ గ్రిడ్ నిర్మాణ పనులను కొనసాగనివ్వమని పాణ్యం డివిజన్ సిపిఎం నేత రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రాజెక్టు పనులను గ్రామానికి చెందిన రైతులు ప్రతి రోజూ అడ్డుకుంటున్నా అధికారులు పని ప్రారంభించడానికి సిద్ధం కావటం శోచనీయమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గ్రామానికి చెందిన 35 మంది రైతులు 70 ఎకరాల భూమిని కోల్పోయారన్నారు. ఒకవైపు పవర్ గ్రిడ్ అధికారులు నష్ట పరిహారం సొమ్ము రూ. 35కోట్లను జిల్లా కలెక్టర్‌కు ఇచ్చామని చెబుతున్నారని, కానీ ఇంతవరకూ ఏ రైతుకూ నష్ట పరిహారం అందలేదన్నారు. రైతులు మాత్రం నష్ట పరిహారం అందే వరకూ పనులు సాగనివ్వమని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.