కర్నూల్

సిద్ధేశ్వరంపై నీలినీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 28 : కృష్ణా నదిపై సప్తనదీ సంగమేశ్వరం సమీపంలోని సిద్ధేశ్వరం గ్రామం వద్ద నిర్మించాలని ప్రజలు కోరుతున్న సిద్ధేశ్వరం ఆనకట్టకు ప్రభుత్వం అనుకూలంగా లేనట్లు స్పష్టమవుతోంది. సిద్ధేశ్వరం ఆనకట్ట నిర్మాణం చేపడుతామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చి సర్వే కూడా చేయించారు. ఆ తరువాత ఆ హామీపై ఎవరూ నోరు మెదపలేదు. వైఎస్ మరణానంతరం రాష్ట్ర విభజన ఉద్యమం ఊపందుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా పక్కనబెట్టింది. ఆ తరువాత 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు సిద్ధేశ్వరం ఆనకట్ట నిర్మాణంపై నిపుణుల సలహాలతో ముందుకుపోతామని తెలిపారు. సిద్ధేశ్వరం ఆనకట్ట కోసం రాయలసీమలో పెద్దఎత్తున ఉద్యమం కూడా నడుస్తోంది. ఆనకట్టను ప్రభుత్వం నిర్మించకుంటే తామే నిర్మించుకుంటామని సిద్ధేశ్వరం ఆనకట్ట సాధన సమితి ఆధ్వర్యంలో గత నెలలో పెద్దఎత్తున సంగమేశ్వరం చేరుకున్న రైతులు శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. స్వచ్ఛందంగా కదిలిన రైతుల కార్యాచరణతో సిద్ధేశ్వరం ఆనకట్టపై వారు పెట్టుకున్న ఆశలను స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మించి రాయలసీమకు మేలు చేయాలని బ్రిటీష్ పాలకులు భావించారని, ఇందుకు అప్పట్లోనే సర్వే సైతం నిర్వహించారని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ తరువాత దేశానికి స్వాతంత్య్రం రావడంతో సిద్ధేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం మూలనపడిందని వెల్లడిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా మదరాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న సమయంలో సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తీసుకురావడంతో సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అంగీకరించి సర్వే చేయించి పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకుని నిర్ణయం తీసుకునే సమయానికి నాటి మదరాసు రాష్ట్రం నుంచి విడిపోవాలని ఆంధ్ర ప్రాంతీయులు ఉద్యమం నిర్వహించారని గుర్తు చేశారు. ఈ ఉద్యమం కారణంగా సిద్ధేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర నిర్ణయం వాయిదా పడింది. అయితే ప్రత్యేకాంధ్ర ఉద్యమ సమయంలో రాయలసీమ ప్రాంతీయుల సహాయం కోసం కుదిరిన శ్రీబాగ్ ఒడంబడికలోనూ సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒప్పందం జరిగింది. రాయలసీమ వాసుల మద్దతుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుని 1953లో మదరాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ వెంటనే సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కదలిక వచ్చి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలో సాంకేతిక కారణాలు చూపుతూ సిద్ధేశ్వరం వద్ద నిర్మించాలని భావించిన ప్రాజెక్టు శ్రీశైలం తరలివెళ్లింది. అక్కడ కూడా కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే శ్రీశైలం ప్రాజెక్టుగా గుర్తించడంతో రాయలసీమ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల భూమి జలాశయం కోసం త్యాగం చేసినా తాగడానికి కూడా వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా రెండు దశాబ్దాలకు పైగా రాయలసీమ వాసులకు సాగునీరు లేక ఎడారిగా మారిపోయింది. ఇక 1983లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దివంగత ఎన్టీ రామారావు రాయలసీమకు మేలు చేయడం కోసం ఆలోచిస్తున్న సమయంలో చెన్నై నగరానికి తాగునీటి కోసం కృష్ణా జలాలను తరలించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే పైపులైన్ ద్వారా నీటిని చెన్నైకి తీసుకుపోవాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఎన్టీఆర్ తప్పుపడుతూ కాలువ ద్వారా తీసుకుపోవాలని రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు సాగునీరు ఇవ్వడానికి కేంద్రం అంగీకరిస్తే చెన్నై నగర వాసులకు తాగునీరు ఇవ్వడానికి అంగీకరిస్తానని మొండి పట్టుదలతో కూర్చోవడంతో ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మితమైందని నిపుణులు పేర్కొంటున్నారు. అయినా సాగునీటి కష్టాలు తీరడం లేదని శ్రీశైలం జలాశయం నుంచి నీటిని దిగువకు ఇష్టానుసారంగా తరలిస్తున్నారని రాయలసీమ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ వ్యవహరించిన తీరుతో సిద్ధేశ్వరం ఆనకట్ట నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలన్న కోరిక మరింత బలపడింది. అయితే ఇందుకు రాష్ట్రంలోని నేతల మధ్య ఏకాభిప్రాయం లేదని ప్రచారం జరుగుతున్న సమయంలో సిద్ధేశ్వరం ఆనకట్టకు బదులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని మరింత మెరుగుపరచి రాయలసీమలో మరో పట్టిసీమను నిర్మిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేయడంతో సిద్ధేశ్వరం ఆనకట్టపై చీకట్లు కమ్ముకున్నట్లేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిద్ధేశ్వరం ఆనకట్ట సాధన సమితి మరో భారీ ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.