కర్నూల్

ఇంటి గోడ కూలి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూలై 29:మండల పరిధిలోని నల్లకాలువ గ్రామంలో ఇంటి గోడ కూలి 5 నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నల్లకాలువకు చెందిన ప్రేమ్‌కూమార్, ప్రేమజ్యోతి దంపతులకు అనురాధ(5నెలలు) కుమార్తె ఉంది. వారు రేకుల షెడ్‌లో జీవించేవారు. సాయంత్రం మంచానికి ఊయల కట్టి అందులో చిన్నారని పడుకోబెట్టారు. అయితే ఉన్నఫళంగా పక్కనే ఉన్న ఇంటి గోడ కూలి వీరి రేకులషెడ్‌పై పడింది. దీంతో ఊయలలో నిద్రిస్తున్న చిన్నారిపై మట్టి ఎక్కువగా పడడంతో మృతి చెందినట్లు వారు తెలిపారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.