కర్నూల్

నంద్యాలలో వైకాపాకు పూర్వవైభవం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 29: నంద్యాలలో వైకాపాకి పూర్వ వైభవం తెస్తానని, కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలుస్తానని నంద్యాల వైపిసి ఇన్‌చార్జి రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆగస్టు 4వ తేదీ నుండి గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని మండలంలోని కొత్తపల్లె గ్రామం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం ముందుండి పోరాడుతానన్నారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు శాంతికాముకులని, అన్ని ఆలోచించే ఇన్‌చార్జి బాధ్యతలను చేపట్టానని, ప్రజలు, కార్యకర్తల అభిష్టం మేరకే నడుచుకుంటానన్నారు. నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపిస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం లో వైఎస్ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని వారందరిని కలుసుకొని నంద్యాలకు వైకాపాకు పూర్వవైభవం తెస్తానన్నారు. పాలక ప్రభుత్వం నిర్ణయంతో సీమ ప్రజలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు చంద్రబాలొంగిపోయారని, కెసిఆర్ ఆదేశాల మేరకే శ్రీశైలం నుండి దిగువకు నీరు విడుదల చేసి సీమకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. టిడిపి నాయకులు, ఇతర ప్రతిపక్షాలకు చెందిన నాయకులు మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం నంద్యాల పట్టణంలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కలెక్టరేట్‌లతోపాటు శ్రీశైలం డ్యాంను ముట్టడించే కార్యక్రమాలను ముమ్మరం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి, రామలింగారెడ్డి, అడ్వకేట్ మాధవరెడ్డి, చంద్రారెడ్డి, చరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
డీఎస్పీకి వినతిపత్రం : శుక్రవారం ఉదయం రాజ్‌గోపాల్‌రెడ్డి డిఎస్పీ కార్యాలయానికి వెళ్లి డిఎస్పీ హరినాథరెడ్డికి నంద్యాల శాంతి భద్రతల విషయంపై వినతిపత్రం అందజేశారు.