కర్నూల్

ఉరుకుంద క్షేత్రానికి భక్తుల పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, జూలై 31:శ్రావణమాస అమావాస్య ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం భక్తులు కోడుమూరు నుంచి శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధికి పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. తొలుత వారు స్థానిక సాయిబాబా మందిరం నుంచి పట్టణ పురవీధుల గుండా ఉరుకుంద ఈరన్న స్వామి నామస్మరణ చేసుకుంటూ బయల్దేరారు. గత పదేళ్ల నుంచి కోడుమూరు నుంచి ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులు శ్రావణమాస అమావాస్య ఉత్సవాలకు పాదయాత్రగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఏడాది కూడా పట్టణంలో వెయ్యి మంది దాకా భక్తులు భారీగా బయల్దేరి వెళ్లారు. భక్తులు కోడుమూరు నుంచి గోనెగండ్ల, ఎమ్మిగనూరు, కోసిగి నుంచి ఉరుకుందకు రెండు రోజుల్లో చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అమవాస్య రోజున భక్తులు ఉరుకుంద ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు.