కర్నూల్

శ్రీమఠం పీఠాధిపతి చాతుర్మాస దీక్ష స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూలై 31:మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంధ్ర తీర్థులు ఆదివారం చాతుర్మాస దీక్షను స్వీకరించారు. 41రోజులు చేపట్టిన ఛాతుర్మాస ధీక్షలో బాగంగా ముందుగా గ్రామదేవత మంచాలమ్మకు పూజలు చేసి, శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. మఠంలో కొలువైన పూర్వపు పీఠాధిపతుల బృందావనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ మూలరాముల దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి హరతి ఇచ్చారు. దీక్షను స్వీకరిస్తున్న పీఠాధిపతులకు శ్రీమఠం వేద పండితులు ఫల పుష్పాలతోపాటు వస్త్రాలు సమర్పించారు. వస్త్రాలను శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనం ముందు ప్రత్యేక పూజలు చేసి అశేష భక్తుల నడుమ దీక్షను స్వీకరించారు, చాతుర్మాస్య దీక్షను పురస్కరించుకుని పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు 41రోజులు పాటు ఎక్కడకైనా ప్రయాణం చేసిన సూర్యాహస్తంలోగా మంత్రాలయం చేరుకునే విదంగా నిబందనలు ఉన్నట్లు మఠం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, తదితర మఠం అధికారులు పండితులు పాల్గొన్నారు.