కర్నూల్

రోళ్లపాడులో బట్టమేక పక్షుల సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, ఆగస్టు 2:మండల పరిధిలోని రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఇటీవల ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పక్షుల సంచా రం కన్పించింది. ఈ కేంద్రంలో పరిధిలో గత ఆరేళ్లుగా బట్టమేక పక్షులు కన్పించడమే అరుదుగా మారింది. గతంలో 70 పక్షుల దాకా సంచరించే ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఒక పక్షి కన్పిస్తేనే సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. పక్షులు ఆశించే పంటలు రైతులు వేయకపోవడంతో పాటు ప్రస్తుతం వేస్తున్న పంటలకు విపరీతంగా క్రిమిసంహారక మందులు వాడడం, వాతావరణం అనుకూలించకపోవడంతో పక్షుల రాక తగ్గుముఖం పట్టింది. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ ఇక్కడ పక్షుల సంచారం అధికం గా వుండేది. వాటి సంతతి వృద్ధికి కూడా ఇదే అరుదైన సమయం. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురవడంతో దాదాపు 2,500 ఎకరాల విస్తీర్ణం గల కేంద్రం లో ఆహ్లాదకర వాతావరణం వుండడంతో రోళ్లపాడు పరిధిలోని మద్దిగుండం చెరువు వద్ద, బరక సంజీవరాయుడు దేవాలయం వద్ద పక్షులు కన్పిస్తున్నాయి. ఇటీవల నంద్యాల రహదారి వద్ద రోడ్డు పనులు చేస్తున్న కూలీలకు కూడా బట్టమేకపక్షి కన్పించినట్లు తెలిపారు. ఏడాదికి ఒక గుడ్డు మాత్రమే పెట్టే ఈ పక్షులు ఈ ఏడాదైనా మళ్లీ ఈ ప్రాంతంలో సంచరిస్తే రోళ్లపాడు కేంద్రం మునుపటి వైభవం సంతరించుకుంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.