కర్నూల్

నేడు జడ్పీ, ఐఎబి సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 4 : జిల్లా పరిషత్, సాగునీటి సలహా మండలి సమావేశాలు శుక్రవారం కర్నూలులో నిర్వహించనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహించే జిల్లా పరిషత్ సమావేశంలో ప్రధానంగా సాగునీటి సమస్య, సిఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై చర్చ సాగే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి దిగువకు సాగునీటి విడుదలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా పట్టుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం నీటి విడుదలపై అసంతృప్తితో ఉన్నా కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా నీరు చేరనుండటంతో ఈ అంశానికి చర్చలో ఎక్కువ ప్రాధాన్యతనివ్వకపోవచ్చని వారంటున్నారు. ఇక జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై కూడా వైకాపా చర్చించాలని పట్టుబడుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి పూర్తి కాలేదని కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని వైకాపా ఆరోపిస్తోంది. ఓర్వకల్లులో విమానాశ్రయం కంటే పరిశ్రమలే ప్రధానమని అయితే వాటిని వదిలి విమానాల కోసం అధికార పార్టీ పరుగులు తీస్తోందని మండిపడుతున్నారు. ఓర్వకల్లు, తంగెడంచలో పరిశ్రమల్లో 6 నెలల్లో ఉత్పత్తి కావాలని పూడిచెర్ల సభలో ముఖ్యమంత్రి ఆదేశించి ఏడాది అవుతున్నా ఇప్పటికీ నిర్మాణ పనులే ప్రారంభం కాలేదని వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే శిలాఫలకాలు ఆవిష్కరించి తూతూ మంత్రంగా ఆదేశాలిచ్చారని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. ఇక సాగునీటి కాలువల పెండింగ్ పనులు సాగుతున్నాయే తప్ప పూర్తవడం లేదని ఆయన అన్నారు. వీటిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని పట్టుపడతామని వైకాపా నేతలు వెల్లడిస్తున్నారు. రైతు, పొదుపు మహిళల రుణమాఫీ, వ్యవసాయ శాఖ నిర్లక్ష్య వైఖరిపై జడ్పీ సమావేశంలో చర్చకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించే సాగునీటి సలహా మండలి సమావేశంలో గుండ్రేవుల జలాశయం, వేదావతి ఎత్తిపోతల పథకం మంజూరుపై స్పష్టమైన హామీ కావాలని వైకాపా సభ్యులు డిమాండ్ చేయనున్నారు. అంతేగాక తుంగభద్ర దిగువ కాలువకు సంబంధించి దీర్ఘకాల సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందన్న అంశం కూడా చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఇక పెండింగ్ పనుల పూర్తిపై కూడా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయంలో 880 అడుగుల వరకూ నీరు విడుదల చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. గోరుకల్లు, అవుకు జలాశయాల పరిస్థితిపై కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. కృష్ణా పుష్కరాల కారణంగా సమయం లేకపోవడం, ఇప్పటికే నిర్వహించాల్సిన సమావేశాలను వాయిదా వేసే అవకాశం లేకపోవడంతో రెండు సమావేశాలు ఒకే రోజు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు.